CM KCR: ఇక్కడి దద్దమ్మ రాజకీయ నాయకులే తెలంగాణ శత్రువులు..: సీఎం కేసీఆర్.
ఆరు జిల్లాల ఆశలు తీరంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. నార్లాపూర్ పంపుహౌస్ దగ్గర శ్రీశైలం కృష్ణా జలాలను ఎత్తిపోయగా బిరబిరా అంటూ కిందకు ఉరకలు వేస్తున్నాయి. అంతకుముందు పంపుహౌస్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం కేసీఆర్. తర్వాత స్విచ్ ఆన్ చేయగా లిఫ్ట్ ఇరిగేషన్‌తో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. 6 జిల్లాలు, 19 నియోజకవర్గాలు ఈ జలాల ద్వారా సస్యశ్యామలం కానున్నాయి.
ఆరు జిల్లాల ఆశలు తీరంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. నార్లాపూర్ పంపుహౌస్ దగ్గర శ్రీశైలం కృష్ణా జలాలను ఎత్తిపోయగా బిరబిరా అంటూ కిందకు ఉరకలు వేస్తున్నాయి. అంతకుముందు పంపుహౌస్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం కేసీఆర్. తర్వాత స్విచ్ ఆన్ చేయగా లిఫ్ట్ ఇరిగేషన్‌తో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. 6 జిల్లాలు, 19 నియోజకవర్గాలు ఈ జలాల ద్వారా సస్యశ్యామలం కానున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టుతో పాలమూరు ప్రజల దశాబ్దాల కల సాకారం కానుంది. స్విచ్ ఆన్‌తో పంటల వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. బీడువారిన పొలాలను, తడారిన పల్లె గొంతులను తడపబోతోంది. ఇంతకాలం వలసలతో తల్లడిల్లిన పాలమూరు జిల్లా ఇకపై పచ్చని పంటలతో అలరారనుంది. లక్షల ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా కృష్ణా జలాలు అందనున్నాయి. తాగునీటి కష్టాలూ తీరనున్నాయి. కరువు కాటకాల కథ మాసిపోనుంది, వలసపోయే బతుకుల యద తీరిపోయింది. ఇక పాలమూరు జిల్లాలో కృష్ణా జలాలతో బంగారు పంటలు పండనున్నాయి. 680 మీటర్ల లోతు నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి బాహుబలి బాప్ లాంటి మోటార్లు ఉపయోగించారు. వందల టన్నుల బరువుతో ఉన్న ఒక్కో మోటార్ ప్రపంచస్థాయి టెక్నాలజీ, సామర్థ్యంతో పని చేస్తాయి. మొత్తం 34 మోటార్లు వినియోగిస్తున్నారు. ఒక్కొక్కటీ 145 మెగావాట్ల సామర్ధ్యం కలిగి ఉన్నాయి. ప్రాజెక్టును ప్రారంభించాక కొల్లాపూర్‌లో జరిగే బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు సీఎం కేసీఆర్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..