Telangana: ఇందిరమ్మ రాజ్యం బాగుంటే.. ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టారు..?
ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్న ప్రియాంక మాటలకు కొల్లాపూర్ సభలో సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం బాగుంటే.. ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టారని.. రూ.2కిలో బియ్యం ఎందుకిచ్చారు? అని కేసీఆర్ ప్రశ్నించారు. పంటలు పండి.. రాజ్యం సస్యశ్యామలంగా ఉంటే.. 2 రూపాలకు కిలో బియ్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు.
ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్న ప్రియాంక మాటలకు కొల్లాపూర్ సభలో సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం బాగుంటే.. ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టారని.. రూ.2కిలో బియ్యం ఎందుకిచ్చారు? అని కేసీఆర్ ప్రశ్నించారు. పంటలు పండి.. రాజ్యం సస్యశ్యామలంగా ఉంటే.. 2 రూపాయిలకే కిలో బియ్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. అప్పటివరకు సగం కడుపుకే పేదలు అన్నం తినేవారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్నీ ఆకలి చావులే, నక్సలైట్ల ఉద్యమాలు, ఎన్‌కౌంటర్లే అన్నారు. ఆ సమయంలో ప్రజలను రాచిరంపాన పెట్టడంతో పాటు దోపిడీలు జరిగాయన్నారు. ఇందిరమ్మ కాలంలో ప్రజలను పట్టించుకోకుండా.. వారి ఖర్మాన వారిని వదిలేశారన్నారు కేసీఆర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Latest Videos