Telangana: బీఆర్‌ఎస్‌లో చేరిన బాబు మోహన్ తనయుడితో ఫేస్ టూ ఫేస్
బీజేపీ పార్టీ చేపట్టిన సర్వేలో ఆందోల్ టికెట్ తనకే ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని.. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదన్నారు ఉదయ్. తాను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న విషయం తన తండ్రి బాబుమోహన్‌కి తెలుసని చెప్పారు. ఆయన ఏమన్నారో ఈ వీడియోలో చూద్దాం పదండి....
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. తండ్రి ఒక పార్టీలో ఉంటే కొడుకు ఒక పార్టీలోకి మారడం చర్చనీయాంశమైంది. అవును ఆందోళ్ బీజేపీ అభ్యర్థి బాబుమోహన్ కొడుకు ఉదయ్ బాబుమోహన్ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని.. ఇది క్లిష్టమైన నిర్ణయమే కానీ, తప్పనిసరి పరిస్థితిల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
బీజేపీ పార్టీ చేపట్టిన సర్వేలో ఆందోల్ టికెట్ తనకే ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని.. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదన్నారు ఉదయ్. తాను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న విషయం తన తండ్రి బాబుమోహన్‌కి తెలుసని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Nov 19, 2023 03:00 PM
వైరల్ వీడియోలు
Latest Videos