బండి సంజయ్, గంగుల కమలాకర్ మధ్య పేలుతున్న మాటల తూటాలు

బండి సంజయ్, గంగుల కమలాకర్ మధ్య పేలుతున్న మాటల తూటాలు

Ram Naramaneni

|

Updated on: Nov 19, 2023 | 3:48 PM

బీఆర్‌ఎస్‌ మంత్రి, ఆ పార్టీ కరీంనగర్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ సమక్షంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కరీంనగర్‌ యూనిట్‌ నుంచి 500 మంది కార్యకర్తలు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లో చేరడంతో కరీంనగర్‌ అసెంబ్లీ స్థానంలో పోరు మరింత ముదిరింది. గతంలో కరీంనగర్ నుంచి రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బలంగా పోరాడుతున్నారు.

కరీంనగర్‌లో బండి సంజయ్‌ వర్సెస్‌ గంగుల కమలాకర్‌గా మారిపోయింది రాజకీయం. ఒవైసీకి బొట్టు పెట్టించి హనుమాన్‌ చాలీసా చదివించే దమ్ముందా..? అని బండి సంజయ్‌ సవాల్‌ విసిరితే..అదే రేంజ్‌లో కౌంటరిచ్చారు మంత్రి గంగుల. అవినీతి, అక్రమాలకు పాల్పడిన కారణంగానే BJP అధ్యక్ష పదవి నుంచి బండిని తప్పించారని ఆరోపించారు. మతం పేరుతో ఎంత రెచ్చగొట్టినా BJPకి ఓట్లు పడవన్నారు గంగుల. ఇంతకీ..వాళ్లిద్దరు ఏమన్నారో చూద్దాం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Nov 19, 2023 03:47 PM