CM Jagan: “మంచి చేయడంలో నాతో పోటీ పడే నేత దేశంలోనే లేడు”
అవ్వాతాతల గురించి పట్టించుకోవాలంటే ప్రేమ ఉండాలి. చంద్రబాబుకు అవ్వాతాతల మీద ప్రేమే లేదన్నారు జగన్. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేది. తాను వచ్చాక 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు జగన్
పేదవారికి మంచిచేయాలన్నా.. పిల్లలకు పెద్దలకు ఎవరికైనా మంచి జరగాలన్నా.. తనతో పోటీ పడేనాయకుడు దేశంలో మరొకరు లేరన్నారు సీఎం జగన్. ఇవాళ వెంకటాచలంపల్లిలో పెన్షనర్లతో జగన్ ముఖాముఖి సమయంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. అవ్వాతాతలకు తాము ఇచ్చినంత పెన్షన్ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వడంలేదన్నారు సీఎం జగన్. తెలంగాణలోనూ తక్కువే ఇస్తున్నారన్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం 4వేలు 8వేల పెన్షన్ కూడా ఇస్తామంటూ మభ్యపెడతారని.. తాను మాత్రం చేయగలిగిందే చెబుతానని.. చెప్పింది తప్పకుండా చేస్తామన్నారు సీఎం జగన్.
తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థపైనే తొలి సంతకం పెడతామన్నారు సీఎం జగన్. చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్లో తలకాయ పెట్టినట్లే అన్నారు వైసీపీ అధినేత. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే లక్షా 40వేల కోట్లు కావాలని.. ఆయన ఇచ్చేది లేదు కాబట్టి.. నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తున్నారన్నారు సీఎం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..