వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో CM రౌండ్ టేబుల్ సమావేశం
యూఏఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు అబుదాబిలో వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. లూలూ, షరాఫ్, ట్రాన్స్‌వర్ల్డ్ వంటి సంస్థలు లాజిస్టిక్స్, నౌకా కేంద్రం, క్యాన్సర్ సెంటర్, ఐటీ పార్కుల ఏర్పాటుకు ఆసక్తి చూపాయి.
యూఏఈలో AP సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు ఆయన అబుదాబిలో పలువురు వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. ఈరోజు తొమ్మిది మీటింగ్స్, విజిట్స్‌లో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీలతో కీలక చర్చలు జరిపిన సీఎం, అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ అల్ జాబి, G42 సీఈఓ ఆల్ మన్సూరి, అబుదాబి పెట్టుబడుల విభాగం చైర్మన్ ఖలీఫాలతో భేటీ అయ్యారు. లూలూ గ్రూప్, అగితా గ్రూప్, మస్దార్ సిటీ వంటి సంస్థల ప్రతినిధులతోనూ వరుస సమావేశాలు నిర్వహించారు. పర్యాటక ప్రాజెక్టులను సందర్శించి, భారత కాన్సులేట్ జనరల్ విందులో పాల్గొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
30ల్లోకి రాకముందే సీనియర్లు అయ్యారుగా
OG నా సినిమాకు కాపీ.. ఆ దర్శకుడి సంచలన ఆరోపణ
ఎన్టీఆర్ – నీల్ సినిమా ఆగిపోయిందా ??
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

