Big News Big Debate: తీరంలో కాపురం..! ఏపీలో మరోసారి హాట్ టాపిక్ గా రాజధాని యవ్వారం.

|

Apr 19, 2023 | 7:57 PM

తోడేళ్లంతా ఏకమై చీకటి యుద్ధం చేస్తున్నాయి.. ఈ చీకటి యుద్ధంలో ప్రజలే నా ధైర్యం.. నా ఆత్మవిశ్వాసం మీరే’’.. అంటూ సీఎం జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్‌.. రాజధానిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తోడేళ్లంతా ఏకమై చీకటి యుద్ధం చేస్తున్నాయి.. ఈ చీకటి యుద్ధంలో ప్రజలే నా ధైర్యం.. నా ఆత్మవిశ్వాసం మీరే’’.. అంటూ సీఎం జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్‌.. రాజధానిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే కాపురం ఉండనున్నట్టు ఆయన వెల్లడించారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నంలోనే బస చేయబోతున్నట్టు స్పష్టంగా ప్రకటించారు ముఖ్యమంత్రి. విపక్షపార్టీలపైనా విరుచుకుపడ్డారు జగన్‌. తోడేళ్లంతా ఏకమై చీకటి యుద్ధం చేస్తున్నాయన్నారు జగన్‌. జిల్లా పర్యటనలో నాలుగు కీలక ప్రాజెక్టులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. 46 నెలల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. మరో చెన్నై, ముంబైలా మారనున్న శ్రీకాకుళం జిల్లా మారనుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టు, అదానీ సెంటర్లకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. టెక్కలిలో దువ్వాడ శ్రీనును ఆశీర్వదించాలన్నారు. రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్య నగరం విశాఖ అని పేర్కొన్న జగన్.. ఈ సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే ఉంటానంటూ స్పష్టంచేశారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే.. అన్ని జిల్లాల అభివృద్ధి కొనసాగుతోందని తెలిపారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తపన అంటూ క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..

Published on: Apr 19, 2023 07:57 PM