Big News Big Debate: తెలుగురాష్ట్రాలపై జాతీయపార్టీ బీజేపీ సీరియస్ ఫోకస్.. వ్యూహం ఏంటి..?
తెలుగురాష్ట్రాలపై జాతీయపార్టీ బీజేపీ సీరియస్‌గానే ఫోకస్ పెట్టింది. తెలంగాణలో అధికారమే లక్ష్యమంటున్న కమలనాథులు.. ఏపీలోనూ సీట్లు, ఓట్లు పెంచుకోవాలనుకుంటున్నాయి. పార్టీకి పవర్ సెంటర్ అయిన అమిత్‌షా, నడ్డాలు నేరుగా రంగంలో దిగి మరీ గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశారు. త్వరలోనే అగ్రనేతల పర్యటనలకు తెలంగాణ నాయకత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇక విశాఖలో కూడా అమిత్‌షా టూర్ కన్ఫామ్ చేసింది బీజేపీ. అటు రాజకీయ పొత్తులు.. ఎత్తులపైనా పార్టీ ప్రధానంగా దృష్టిపెట్టింది.
తెలుగురాష్ట్రాలపై జాతీయపార్టీ బీజేపీ సీరియస్‌గానే ఫోకస్ పెట్టింది. తెలంగాణలో అధికారమే లక్ష్యమంటున్న కమలనాథులు.. ఏపీలోనూ సీట్లు, ఓట్లు పెంచుకోవాలనుకుంటున్నాయి. పార్టీకి పవర్ సెంటర్ అయిన అమిత్‌షా, నడ్డాలు నేరుగా రంగంలో దిగి మరీ గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశారు. త్వరలోనే అగ్రనేతల పర్యటనలకు తెలంగాణ నాయకత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇక విశాఖలో కూడా అమిత్‌షా టూర్ కన్ఫామ్ చేసింది బీజేపీ. అటు రాజకీయ పొత్తులు.. ఎత్తులపైనా పార్టీ ప్రధానంగా దృష్టిపెట్టింది.ఐదారు నెలల్లో జరిగే తెలంగాణ ఎన్నికలే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కీలక నేత, హోంమంత్రి అమిత్‌షా, అటు పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నారు. 15న ఖమ్మంలో, 25న మహబూబ్‌నగర్‌లో పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు బీజేపీ నాయకులు. బహిరంగసభలతో పాటు అటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. జూన్ చివరి వారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్‌షో కూడా ప్లాన్ చేస్తోంది తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం. గత 9 ఏళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను జనాల్లోకి బలంగా తీసుకెళతామంటోంది బీజేపీ. కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటేనంటున్న బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.