Watch Live: బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి..! నివురుగప్పిన నిప్పులా అచ్చంపేట..

|

Nov 12, 2023 | 7:41 AM

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణతో ఒక్కసారిగా టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. అధికారపార్టీ నేతలు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలతో గొడవ మొదలైంది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపైనా కొందరు దాడి చేశారు.

Watch Live: బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి..! నివురుగప్పిన నిప్పులా అచ్చంపేట..
Guvvala Balaraju
Follow us on

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణతో ఒక్కసారిగా టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. అధికారపార్టీ నేతలు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలతో గొడవ మొదలైంది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపైనా కొందరు దాడి చేశారు. ఓ రాయి బాలరాజు ముఖానికి తగిలింది.. మరికొందరికి కూడా గాయాలయ్యాయి.. ముఖానికి దెబ్బ తగలడంతో ఎమ్మెల్యేను వెంటనే ఇంటికి తీసుకెళ్లారు. కాసేపటికి స్ఫృహతప్పి పడిపోవడంతో ఆయన్ను హైదరాబాద్‌ తరలించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గువ్వల బాలరాజుకు చికిత్స చేశారు. ఇంకా ఆయన హాస్పిటల్‌లోనే ఉన్నారు.. కాంగ్రెస్‌, BRS వర్గాల ఘర్షణలు, పోటాపోటీ ఆందోళనలతో అచ్చంపేటలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..