Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలి – షర్మిల
విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లడ్డూ వివాదం, సుప్రీం వ్యాఖ్యలపై స్పందించారు. శ్రీవారి లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో సిట్ దర్యాప్తుపై సంతృప్తిగా లేదని గుర్తుచేశారు. కల్తీ వివాదంపై ముందుగా తామే స్పందించి విచారణ కోరామని చెప్పారు. లడ్డూ వివాదాన్ని కొన్ని పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉందన్నారు.
విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లడ్డూ వివాదం, సుప్రీం వ్యాఖ్యలపై స్పందించారు. శ్రీవారి లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో సిట్ దర్యాప్తుపై సంతృప్తిగా లేదని గుర్తుచేశారు. కల్తీ వివాదంపై ముందుగా తామే స్పందించి సీబీఐ విచారణ కోరామని చెప్పారు. ఈ విషయంపై హోం శాఖ మంత్రి అమిత్ షా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు గుర్తుచేశారు. అలాగే ఏపీ గవర్నర్‌ను కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఫిర్యాదు చేశామన్నారు. తిరుమల లడ్డూ వివాదాన్ని కొన్ని పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డూ వివాదాన్ని రాజకీయాలకు వాడుకోకూడదని తాము మొదటి నుంచీ చెబుతున్నామన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

