Chandrababu Naidu: అరటి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన AP CM
రాయలసీమలోని అరటి రైతులు తీవ్ర గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. టన్నుకు రూ.28 వేలు పలకాల్సిన అరటి ధర ప్రస్తుతం రూ.1000-2000కు పడిపోయింది. ఈ సంక్షోభంపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రానికి లేఖ రాసి, రైల్వే వ్యాగన్ల ద్వారా అరటిని ముంబై, కోల్కతా మార్కెట్లకు తరలించి, గిట్టుబాటు ధర కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో అరటి రైతులు తీవ్ర గిట్టుబాటు ధర సమస్యతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, నార్పల, పుట్లూరు, యాడికి మండలాలతో పాటు కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో అరటి సాగు చేసే రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, టన్నుకు రూ.28 వేలు పలకాల్సిన అరటి ధర ప్రస్తుతం రూ.1000-2000కు పడిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కిలో అరటిపండు కేవలం రూ.1-2కు అమ్ముడవుతుండటంతో, రైతులు తమ అరటి గెలలను రోడ్లపై పారబోసి, తోటలను ట్రాక్టర్లతో దున్నిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు తగ్గాయి
ప్యాషన్‌తో అక్కడ.. పైసల కోసం ఇక్కడ.. నార్త్ నాయికల స్ట్రాటజీ
సమ్మర్‌లో మెగా కార్నివాల్.. చికిరి చికిరితో స్టార్ట్