Reservation Cancel: 65 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు.

Reservation Cancel: 65 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు.

Anil kumar poka

|

Updated on: Jun 23, 2024 | 2:22 PM

65 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు పట్నా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గతేడాది బిహార్‌ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 65 శాతానికి పెంచింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పట్నా హైకోర్టు, 65 శాతానికి రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని తాజాగా తీర్పు వెలువరించింది.

65 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు పట్నా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గతేడాది బిహార్‌ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 65 శాతానికి పెంచింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పట్నా హైకోర్టు, 65 శాతానికి రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని తాజాగా తీర్పు వెలువరించింది. బిహార్​లో కులగణన తర్వాత విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను పెంచుతూ సవరణ బిల్లును తీసుకొచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ, రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనకబడిన, అణగారిన వర్గాల రిజర్వేషన్లు 50 శాతం నుంచి 65 శాతానికి పెరిగాయి. ఆర్థికంగా వెనకబడినవారిని ఉద్దేశించిన 10శాతం రిజర్వేషన్లు కలిపి రిజర్వేషన్లు 75శాతానికి చేరాయి. అయితే, ఈ పెంపుపై కొన్నివర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.