PM Modi: కొందరికి పాకిస్థాన్‌ నుంచి ఎందుకు మద్ధతు లభిస్తోంది.? మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రముఖ మీడియా సంస్థ ఐఏఎన్ఎస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.  భారత్‌పై శత్రుత్వాన్ని పెంచుకునే వారిని కొందరు ఎందుకు ఇష్టపడతారో తనకు తెలియడం లేదని మోదీ అన్నారు. కొంతమంది వ్యక్తులకు పాకిస్థాన్‌ నుంచి ఎందుకు మద్ధతు లభిస్తోంది.? అంటూ ప్రశ్నించారు...

PM Modi: కొందరికి పాకిస్థాన్‌ నుంచి ఎందుకు మద్ధతు లభిస్తోంది.? మోదీ కీలక వ్యాఖ్యలు

|

Updated on: May 27, 2024 | 10:15 PM

ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రముఖ మీడియా సంస్థ ఐఏఎన్ఎస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.  భారత్‌పై శత్రుత్వాన్ని పెంచుకునే వారిని కొందరు ఎందుకు ఇష్టపడతారో తనకు తెలియడం లేదని మోదీ అన్నారు. కొంతమంది వ్యక్తులకు పాకిస్థాన్‌ నుంచి ఎందుకు మద్ధతు లభిస్తోంది.? అంటూ ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ చేయాల్సి ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. ఇక అవినీతిపరులను రక్షించేందుకు దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా తప్పుడు కథనాలను సృష్టిస్తున్నారని ప్రతిపక్షాలపై, ఓ వర్గం మీడియోపై మోదీ విరుచుకుపడ్డారు. సోనియాతో పాటు ఇతరులను అరెస్ట్ చేయాలని గతంలో డిమాండ్ చేసిన వారు అవినీతిపై ప్రభుత్వ అణిచివేతకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం లేదని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా ఆయన మండిపడ్డారు.

ఇక ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌లను పాకిస్తాన్ ఎందుకు ఆమోదించిందని మోదీ అన్నారు. భారత ప్రజాస్వామ్యం చాలా పరిణతి చెందినది అన్న మోదీ, దానికి ఆరోగ్యకరమైన సంప్రదాయాలు ఉన్నాయని అన్నారు. భారతీయ ఓటర్లు ఇతర దేశాల కార్యకలాపాల వల్ల ప్రభావితం కారని మోదీ ధీమా అన్నారు. ఇక అవినీతిపరులను కీర్తించడం ఆందోళన కలిగించే అంశమన్నారు. అవినీతిపరులకు అండగా నిలవడం ఈరోజుల్లో ఫ్యాషన్‌గా మారిపోయిందని మోదీ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు న్యాయం కోసం వాదించిన వారు ఇప్పుడు దానిని వ్యతిరేకించడం విడ్డూరమన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow us