PM Modi: ఎయిరిండియా విమాన ప్రమాదం.. ఘటనాస్థలిని పరిశీలించిన ప్రధాని మోదీ
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన దగ్గర రాత్రంతా DGCA తనిఖీలు చేశారు. ఆధారాలు సేకరించడం సహా ప్రమాద తీరును విశ్లేషిస్తున్నారు అధికారులు. ఇవాళ ప్రైమరీ రిపోర్ట్ సిద్ధం చేయబోతోంది DGCA. 2 ఇంజిన్లు ఫెయిల్ అయిన కారణంగా ప్రమాదం జరిగినట్లు ఇప్పటికే గుర్తించారు. మరోవైపు ప్రమాదస్థలిని ప్రధాని మోదీ పరిశీలించారు.
అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. వైద్య కళాశాల సముదాయంపై విమానం పడిపోవడంతో అక్కడ మరో 24 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ దుర్ఘటన నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అధికారుల నుంచి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
Published on: Jun 13, 2025 09:16 AM
Follow Us
వైరల్ వీడియోలు
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

