RBI 90 Years Ceremony Updates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆర్బీఐ స్థాపించి 90 ఏళ్లు అయిన సందర్భంగా.. ముంబైలో ప్రత్యేక స్మారక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 సంవత్సరాల స్మారక వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా పాల్గొన్నారు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 1 ఏప్రిల్ 1935న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 ప్రకారం స్థాపించారు. కాగా.. 1 జనవరి 1949న జాతీయం చేశారు. ఈ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, వాణిజ్య బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులకు బ్యాంకర్‌గా వ్యవహరిస్తుంది. అయితే, రూపాయి మారకం విలువ స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో ఆర్బీఐ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..