PM Modi Mann Ki Baat : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతీనెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా తన మనసులోని మాటలను ప్రజలతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. రేడియో ప్రసారమయ్యే ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ప్రోగ్రాంకు ప్రజాధారణ పొందింది. దేశ ప్రజలతో మమేకం కావాలనే టార్గెట్‌తో మొదలు పెట్టిన ఈ కార్యక్రమంతో ప్రధాని మోదీ ప్రజలతో పలు విషయాలపై ప్రతినెలా ముచ్చటిస్తారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో జరిగే అంశాలపై కూడా ప్రధాని మోడీ మాట్లాడుతారు. ప్రధాని నరేంద్ర మోదీ తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 104వ ఎపిసోడ్‌లో భాగంగా ఈరోజు ప్రసంగిస్తున్నారు. 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. “ఆదివారం ఉదయం 11 గంటలకు ట్యూన్ చేయండి. భారతదేశం అంతటా స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాలను హైలైట్ చేయడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది.” అంటూ ప్రధాని అంతకు ముందు ట్వీట్ చేశారు. మన్ కీ బాత్ 103వ ఎడిషన్ జూలై 30న ప్రసారం అయింది. ప్రధాని మోదీ మొదటిసారిగా ‘మేరీ మాతీ మేరా దేశ్’ ప్రచారాన్ని ప్రస్తావించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..