ఎన్‌పీఎస్‌లో కీలక మార్పు రూ.8 లక్షలు విత్ డ్రా
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో కేంద్ర ప్రభుత్వేతర ఉద్యోగులకు పెన్షన్ ఉపసంహరణ నిబంధనలు సడలించారు. ఇప్పుడు రూ.8 లక్షల వరకు ఉన్న NPS కార్పస్‌ను ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో ఈ పరిమితి రూ.5 లక్షలు మాత్రమే. PFRDA ఈ మార్పులను ప్రకటించింది, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక వెసులుబాటును కల్పిస్తుంది. రూ.8-12 లక్షల మధ్య నిబంధనలు, 60:40 నియమం గురించి కూడా వివరించబడింది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో కేంద్ర ప్రభుత్వేతర ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయం వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత ఎన్‌పీఎస్‌లో పెన్షన్ ఉపసంహరణ నిబంధనను సడలించింది. డిసెంబర్ 16న పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రకటన విడుదల చేసింది. ఈ సవరణల ప్రకారం..కేంద్ర ప్రభుత్వేతర ఉద్యోగులు తమ ఎన్‌పీఎస్ అకౌంట్‌లో రూ.8 లక్షలు ఉంటే ఒకేసారి ఆ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. గతంలో తమ కార్పస్ ఫండ్ నుంచి రూ.5 లక్షలు మాత్రమే విత్ డ్రా చేసుకునేలా పరిమితులు ఉండేవి. ఇప్పుడు రూ.8 లక్షల వరకు ఉంటే ఒకేసారి మొత్తం తీసుకోవచ్చు. ఇక రూ.8 నుంచి రూ.12 లక్షల వరకు కార్పస్ ఫండ్ ఉంటే.. రూ.6 లక్షల వరకు ఉపసంహరించుకోవచ్చు. ఇక రూ.12 లక్షలకు మించి ఉంటే ప్రస్తుతం అమల్లో ఉన్న 60:40 నియమం వర్తిస్తుంది. అంటే 60 శాతం వరకు ఒకేసారి ఉపసంహరించవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్‌పీఎస్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి నిబంధనలు మారలేదు. సాధారణంగా ఎగ్జిట్ అవ్వడానికి ఎన్‌పీఎస్ చందాదారులు 60 సంవత్సరాల వయస్సు వరకు లేదా పదవీ విరమణ లేదా పదవీ విరమణ వయస్సు, ఏది వర్తిస్తుందో అంతవరకు పెట్టుబడి పెట్టడం కొనసాగించాల్సి ఉంటుందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ నిబంధనల్లో చేర్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ.. ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?
టీ20 వరల్డ్‌కప్-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్

