గడ్డకడుతున్న జలపాతాలు వీడియో
దేశంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉత్తరాది వాసులను వణికిస్తోంది. చలిపులికి గజగజలాడుతూ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం పూట మంచుతో బయటకు రాలేని పరిస్థితులు ఉండగా, సాయంత్రం 4 తర్వాత తీవ్రమైన చలి కొనసాగుతోంది. కొద్ది రోజులుగా ఈ పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని కోక్సన్ ప్రాంతంలో జలపాతాలు గడ్డకట్టుకుపోయాయి. గడ్డకట్టుకుపోయిన జలపాతాల వద్ద సందర్శకులు సందడి చేస్తున్నారు.
జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న మంచు చుక్కలు చూపిస్తోంది. ఎత్తైన భూభాగాల్లో హిమపాతం పెరిగి లోయలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జలవనరులున్న ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చలికి నీళ్లే గడ్డ కట్టుకుపోతున్నాయి. గుల్‌మార్గ్‌లోని స్కై రిసార్ట్, సోనామార్గ్, దూద్‌పత్రి సహా దక్షిణ, ఉత్తర కశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాలలో భారీగా మంచు కురుస్తుండటంతో అక్కడి వాళ్లు గజగజ వణుకుతున్నారు. ఇటు కశ్మీర్ అంతటా పరుచుకున్న మంచు దుప్పటి ఓ వైపు పర్యాటకులను ఆకర్షిస్తుండగా.. మరోవైపు భారీగా మంచు పేరుకుపోయి పెద్ద సంఖ్యలో రోడ్లను మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు చలికి తోడు అక్కడక్కడా వర్షం కూడా కురుస్తుండటంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు అధికారులు.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో
మేడారం గద్దెలకు కొత్త రూపు వీడియో
గడ్డకడుతున్న జలపాతాలు వీడియో
ఈ ఏడాది మోస్ట్ పాపులర్ వైరల్ వీడియోస్.. ఇవే వీడియో
ప్రియుడి కోసం భర్త బలి అమ్మో.. ఆడోళ్లు ఇలా తయారేంట్రా బాబు వీడియో
దూసుకెళ్తున్న బంగారం,వెండి ధరలు వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
