AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల ఎంట్రీ

తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల ఎంట్రీ

Phani CH
|

Updated on: Feb 01, 2026 | 5:47 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలోకి 2026 నాటికి చాలా మంది కొత్త హీరోయిన్లు ప్రవేశించబోతున్నారు. రషా థడానీ, సాత్విక వీరవల్లి, ఇమాన్వీ ఇస్మాయిల్, తృప్తి దిమ్రి, సారా అర్జున్, మాళవికా మోహనన్ వంటి వారు స్టార్ హీరోల చిత్రాలతో రంగప్రవేశం చేస్తున్నారు. సాక్షి వైద్య ఇప్పటికే అవకాశాలు అందుకుంటున్నారు. ఇది టాలీవుడ్‌కు హీరోయిన్ల కొరతను తీరుస్తుంది.

తెలుగు చిత్ర పరిశ్రమ రాబోయే కొన్నేళ్ల పాటు హీరోయిన్ల కొరత లేకుండా కళకళలాడనుంది. ముఖ్యంగా 2026 నాటికి అనేకమంది కొత్త నాయికలు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. వీరంతా స్టార్ హీరోల సినిమాలతోనే పరిచయం అవుతుండటంతో విడుదలకు ముందే వారి పేర్లు చర్చనీయాంశమవుతున్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమాతో రషా థడానీ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఉయ్యమ్మ పాటతో ఈమె ఇప్పటికే గుర్తింపు పొందారు. వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆకాశంలో ఒక తార చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన సాత్విక వీరవల్లి నటిస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాలీవుడ్‌కు కలిసొస్తున్న సక్సెస్ ఫార్ములా

అనౌన్స్‌మెంట్స్ ఓకే.. అసలు వస్తారా అండి మీరు..

Shriya Saran: సౌత్ బ్యూటీ అన్న ట్యాగ్ తో హ్యాపీ అంటున్న శ్రేయ

Mouni Roy: బాలీవుడ్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్న మౌనీ

మళ్లీ తెర మీదకు మల్టీస్టారర్ న్యూస్