Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జస్ట్‌ ఈ నీళ్లు తాగితే చాలు.. జుట్టు నల్లగా..ఒత్తుగా పెరుగుతుంది

జస్ట్‌ ఈ నీళ్లు తాగితే చాలు.. జుట్టు నల్లగా..ఒత్తుగా పెరుగుతుంది

Samatha J

|

Updated on: May 16, 2025 | 8:05 PM

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. చిన్న వయసులోనే జుట్టు ఊడిపోవడం, చుండ్రు, బట్టతల వంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో లభ్యమయ్యే హెయిర్ ఆయిల్స్, షాంపూలు, క్రీములు వాడిన ఎక్కువగా ఫలితం కనిపించదు. ఎందుకంటే అవన్నీ తాత్కాలిక ఉపశమనాలని మాత్రమే అందించగలవు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా ఇంటి వద్దనే సులభంగా తయారుచేసుకునే మార్గాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనదే ఎండుద్రాక్ష నీరు. ఈ నీరు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా జుట్టుకు కూడా అనేక రకాలుగా లాభాన్ని ఇస్తుంది.

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే జుట్టు ఆరోగ్యం మెరుగు అవుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. ఎండుద్రాక్షలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఐరన్ జుట్టు వృద్ధికి ఎంతో అవసరం. ఇది తక్కువైతే జుట్టు రాలిపోవడం మొదలవుతుంది. ఎండుద్రాక్ష నీటిని తాగటం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు త్వరగా శోషించబడతాయి. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. తలలో రక్తప్రసరణ చక్కగా జరిగి జుట్టు వృద్ధికి సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చుండ్రు, తలచర్మం, అలర్జీలు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి