మూడు రాష్ట్రాలపై తుఫాన్‌ పడగ.. మొంథా మొత్తం తుడిచేస్తుందా

Updated on: Oct 29, 2025 | 1:08 PM

మొంథా తుఫాన్‌ వేగం తీరం చేరుకునే కొద్దీ దాని తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. ప్రస్తుతం తుఫాన్‌ ప్రభావంతో 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావం ఏపీ మీదే కాదు, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా ఉంది. తుఫాన్‌ పరిధిలోకి వచ్చే ప్రాంతాలన్నింటిలో ఇది తీవ్ర ప్రభావం చూపనుందని, ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలతో బాటు ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ముఖ్యంగా.. తీరానికి దగ్గరైన సమయంలో ఇది తీవ్ర నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇక.. మొంథా తుఫాను తీరం దాటే సమయంలో … కోస్తా తీరంలోని మచిలీపట్నం, అంతర్వేది, అమలాపురం, యానాం, కాకినాడ, పిఠాపురం ప్రాంతాల్లో అత్యంత తీవ్రమైన వర్షం, భీకరమైన గాలులు వీస్తాయని ఐఎండీ అంచానా వేస్తోంది. ఇదే క్రమంలో గుడివాడ, ఏలూరు, రాజమండ్రి ప్రాంతంలో కూడా తుఫాన్‌ బీభత్సం తీవ్రంగా ఉండే అవకాశముందని ఐఎండీ భావిస్తోంది. ఇక తెలంగాణపై కూడా మొంథా తుఫాన్‌ ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవటంతో బాటు వాతవారణం బాగా చల్లబడింది. తుఫాన్ తీరాన్ని సమీపించే కొద్దీ.. మధిర, సత్తుపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలపై, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని కేసముద్రం, మహబూబాబాద్‌ ప్రాంతాల్లో తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు, ఈదురుగాలుల బీభత్సం తప్పదంటున్నారు నిపుణులు. ఇక ఏపీ, తెలంగాణలో మాత్రమే కాదు…ఛత్తీస్‌గఢ్‌లో కూడా మొంథా తుఫాన్‌ ప్రభావం చూపిస్తోంది. అక్కడి దాకా తుఫాన్‌ పడగ విస్తరించింది.ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌, దంతెవాడ, కిరండోల్‌, సుక్మా ప్రాంతాల దాకా దీని ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

OTTలో OGకి దిమ్మతిరిగే రెస్పాన్స్ ..షేకవుతున్న నెట్‌ఫ్లిక్స్‌

Janhvi Kapoor: తల్లి శ్రీదేవి కోసం రాసిన కవితతో అందరినీ ఏడిపించిన జాన్వి

కామెడీ పేరుతో పిచ్చివాగుడు.. వివాదంలో హైపర్ ఆది

‘బలుపు, యాటిట్యూడ్‌ తనే కాదు.. నువ్వూ కూడా తగ్గించుకోవాలమ్మా

TOP 9 ET News: దిమ్మతిరిగే బిజినెస్‌..అప్పుడే లాభాల్లో చిరు సినిమా