మందుబాబులు అలర్ట్ !! ఇక తాగి వాహనం నడిపితే
కర్నూలు బస్సు ప్రమాద ఘటన తర్వాత తెలంగాణలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో మందుబాబులపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. తాగి వాహనం నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మద్యం మత్తులో వాహనం నడిపే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
తాగి వాహనం నడిపివారు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఇతరులు సైతం ప్రాణాలు కోల్పోయేలా ఘటనలు జరుగుతున్నాయని హైదరాబాద్ పోలీసులు అన్నారు. కొద్దిరోజుల క్రితం కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన ఘటననే ఉదాహరణగా చూపించారు హైదరాబాద్ పోలీసులు. శివశంకర్ అనే యువకుడు తాగి వాహనం నడిపి డివైడర్‌ను ఢీ కొట్టి తాను చనిపోవడమే కాకుండా మరో 19 మంది మరణానికి కారణమయ్యాడు. శివశంకర్ నడిపిన బైక్ రోడ్డు మీదే పడి ఉండటం ఆ తర్వాత అదే రూట్లో వెళుతున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఆ బైక్‌ను ఢీకొనటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతై 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో అసలు శివశంకర్ అనే యువకుడు మద్యం సేవించకుండా ఉండి ఉంటే 19 మంది ప్రాణాలు పోయేవి కావని పోలీసులు చెప్పారు. ఆ యువకుడు మద్యం సేవించి బండి నడపడం వల్లే 19 మంది ప్రాణాలు పోయాయన్నారు. కర్నూల్ ఘటన తర్వాత హైదరాబాదులోనూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు. తాగి వాహనం నడిపి ఇతరుల ప్రాణాలు కోల్పోవడానికి కారకులయ్యే వారిని ఉగ్రవాదులుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అభివర్ణించారు. తమ ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలు సైతం తీస్తున్న వారిని ఉగ్రవాదులుగా చూడటమే కరెక్ట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. కర్నూల్ ఘటన తర్వాత హైదరాబాదులో అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా నిరంతరం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్
దైవసాక్షిగా సాగిన స్వాతంత్ర్య పోరాటానికి.. సజీవ సాక్ష్యం ఈ గ్రామం
రాచనాగుతో మామూలుగా ఉండదు మరి.. ఒకేరోజు రెండు కింగ్ కోబ్రాలు..
ఇంట్లో చోరీకి వచ్చి ఆ దొంగ చేసిన పనికి.. నవ్వకుండా ఉండలేరు!
రోడ్డు పై పులి ప్రత్యక్షం.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం
హాస్టల్లో దెయ్యం..! భయంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన విద్యార్ధినిలు
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు

