Weather Update: నవంబరు 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
మొంథా తుపాను ఏపీవైపు దూసుకొస్తున్న తరుణంలో భారత వాతావరణశాఖ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. తుపాను గమనం, తీరం దాటే విషయంలో ప్రస్తుతానికి పెద్దగా మార్పులు కనిపించడం లేదన్నారు. కాకినాడ సమీపంలోనే తీరం దాటేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని.. అలాకాని పక్షంలో తుని సమీపం వైపు లేదా నరసాపురం వైపు కొద్దిగా దిశ మార్చుకునే అవకాశముందని తెలిపారు.
ప్రస్తుతం తుపాను వాయవ్య దిశగా కదులుతున్న నేపథ్యంలో తమిళనాడులో వర్షాలు తగ్గి, ఒంగోలు నుంచి శ్రీకాకుళం వరకు నెమ్మదిగా వర్షాలు పెరుగుతాయని వెల్లడించారు. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న వాయుగుండం, బంగాళాఖాతంలో ఉన్న తుపాను ఒకదానికొకటి బలం చేకూర్చుకుంటున్నాయని, అందుకే అరేబియాలో వాయుగుండం బలహీనపడకపోగా ముందుకు కదలట్లేదని పేర్కొన్నారు. మరోవైపు ఉత్తరాదిలో ఉన్న వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ బంగాళాఖాతంలోని తుపానును నేపాల్ వైపు లాగుతోందని, ఇది నేపాల్ వరకు వెళ్లిన తర్వాత అరేబియాసముద్రంలోని వాయుగుండం బలహీనపడే అవకాశముందని వెల్లడించారు. నవంబరు 4 లేదా 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఇది భారతదేశం వైపు రాకపోవచ్చని అంచనా వేశారు. ఇది కూడా వాయుగుండంగా మారేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

