Video: బతుకమ్మ ఆడిన ప్రపంచ అందగత్తెలు..! సంప్రదాయ దుస్తుల్లో వరంగల్‌లో సందడి
మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ప్రపంచ సుందరీమణులు వరంగల్‌కు సందర్శించారు. వారికి జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. హరిత హోటల్ వద్ద బతుకమ్మ ఆడారు. తెలుగు సంప్రదాయ వస్త్రాలను ధరించి, పట్టు పరికిణిలో సందడి చేశారు. వరంగల్‌లో వారి సందర్శనం తెలుగు సంస్కృతిని ప్రపంచానికి చాటింది.
మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ప్రపంచ సుందరీమణులు బుధవారం వరంగల్ పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా వారికి పూల మాలలు వేసి ఘన స్వాగతం పలికారు జిల్లా అధికారులు. అలాగే వరంగల్ హరిత హోటల్‌లో సందడి చేశారు. హోటల్ ప్రధాన ద్వారం ముందు బతుకమ్మ ఆడారు. బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ బతుకమ్మ ఆడారు. డోలు- సన్నాయిలతో సుందరిమణులకు జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత తెలుగుదనం ఉట్టిపడేలా పట్టుపరికిణిలో సందడి చేశారు.
ఆ తర్వాత ములుగు జిల్లా రామ పాలయానికి ప్రపంచ సుందరిమణులు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర ఎస్పీ శబరిష జిల్లా అధికారులు టూరిజం శాఖ అధికారులు ప్రపంచ సుందరి మహిళలకు ఘన స్వాగతం పలికారు. గుస్సాడీ నృత్య ప్రదర్శన ఒగ్గుడోలు ప్రదర్శన ద్వారా కళాకారులు వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలోకి చేరుకున్న సుందరిమణులు ఎవరికి వారే స్వయంగా కాళ్లు కడుక్కొని పూజలు చేసేందుకు ఆలయంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత చరిత్ర ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

