రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు ఇది చేయండి
చాలా మంది భోజనం చేసిన వెంటనే అలా బెడ్ పైన వాలిపోతుంటారు. ఇది సరైన పద్ధతి కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. రాత్రి పూట తిన్న తర్వాత కనీసం పది నిమిషాల పాటు వాకింగ్ చేయడం చాలా ముఖ్యం అని అంటున్నారు. లేదంటే కనీసం నిటారుగా నిలబడాలని చెబుతున్నారు.
పొరపాటున కూడా తిన్న వెంటనే పడుకోకూడదంటున్నారు. భోజనం చేసిన తర్వాత కాసేపు వాకింగ్ చేయడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. దీంతో డయాబెటిస్ ముప్పు నుంచి రక్షించుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మెటబాలిజం రేటు పెరిగి క్యాలరీల ఖర్చు రెట్టింపు అవుతుంది. దీంతో బరువు అదుపులో ఉంటుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం అలవాటు చేసుకుంటే మంచిది. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేస్తే గుండెకు రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఉల్లాసంగా ఉంటారు. తిన్న తర్వాత వాకింగ్ చేస్తే రక్తంలోని కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది. రాత్రి భోజనం తర్వాత కాసేపు వాకింగ్ చేయడం వల్ల బాడీ మనసు ప్రశాంతంగా మారుతాయి. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది. నిద్రలేమితో బాధపడేవారు వాకింగ్ అలవాటు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఖచ్చితంగా అన్నం తిన్నాక వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాణి చీమల అక్రమ రవాణా.. మార్కెట్ లో వాటి విలువ తెలిస్తే షాక్
అమెజాన్ అడవుల్లో భారీ అనకొండ హల్‌చల్
కూల్‌డ్రింక్స్ ఇష్టంగా తాగేస్తున్నారా.. జాగ్రత్త
ఈ అన్నం తింటే షుగర్ అస్సలు పెరగదు.. ట్రై చేయండి!!
2 నెలల గ్యాప్‌లో 2 లగ్జరీ కార్లు..! దాదాపు రూ.2 కోట్లు ఖర్చుపెట్టిన సోనియా

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
