Kolleru Lake: కొల్లేరుకు జల కళ.. విదేశీ పక్షుల సందడి
ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన కొల్లేరుకు జలకళ వచ్చింది. ఎటు చూసినా నీటితో కళకళలాడు తోంది. పర్యాటకులను, కొల్లేరు గ్రామాల ప్రజలను పులకింతకు గురిచేస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వేల క్యూసెక్కుల నీరు సరస్సులోకి చేరడంతో నీటితో నిండుగా ఉంది. పోల్ రాజుకాలువ, పెద ఎడ్లకాడి, చిన ఎడ్లకాడిల నుంచి దిగువకు నీరు విడుదల చేయడంతో కోమటిలంక వద్ధ ఉద్రృతంగా వరద నీరు ప్రవహిస్తుంది.
ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన కొల్లేరుకు జలకళ వచ్చింది. ఎటు చూసినా నీటితో కళకళలాడు తోంది. పర్యాటకులను, కొల్లేరు గ్రామాల ప్రజలను పులకింతకు గురిచేస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వేల క్యూసెక్కుల నీరు సరస్సులోకి చేరడంతో నీటితో నిండుగా ఉంది. పోల్ రాజుకాలువ, పెద ఎడ్లకాడి, చిన ఎడ్లకాడిల నుంచి దిగువకు నీరు విడుదల చేయడంతో కోమటిలంక వద్ధ ఉద్రృతంగా వరద నీరు ప్రవహిస్తుంది. విదేశీ వలస పక్షులకు నిలయంగా ఉన్న కొల్లేరు సరస్సు…. లక్షకు పైగా ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ సరస్సు ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. అరుదైన పక్షులకు ఆలవాలంగా నిలిచింది. ఈ సరస్సుకు విదేశీ పక్షులు వలస వచ్చి ఇక్కడ విడిది చేస్తుంటాయి. వీటితో పాటు స్వదేశీ పక్షులు సైతం సరస్సులో సందడి చేస్తుంటాయి. శీతాకాలం విడిది కోసం కొల్లేరు ప్రాంతానికి చేరుకున్న లక్షలాది విదేశీ పక్షులు వచ్చాయి. ప్రతి ఏడాది ఇంటి ఆడపడుచుల్లా కొల్లేరుకి పక్షులు రావడం ఆనవాయితీగా ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విదేశీ విద్యార్థులకు షాక్ !! వీసా నిబంధనలు మరింత కఠినతరం
ఈ ఆటో డ్రైవర్ చాలా స్పీడ్ గురూ !! రైలు కంటే వేగంగా వెళ్లి
ఎస్సై చేసిన పొరపాటు.. మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్
రోడ్డుమీద హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి.. ఒక్కసారిగా దూసుకొచ్చిన పులి !!