Meru International School: చెత్తతోనూ అద్భుతాలు.. మెరూ స్కూల్ విద్యార్ధుల సరికొత్త ఆవిష్కరణలు..
చిన్నారులకు అవకాశమిస్తే.. వారు తమ మేథా శక్తికి పదును పెడతారు. ఒక్కోసారి వారి ఆలోచనలు, ఆవిష్కరణలు పెద్దవారినే ఆశ్చర్యపోయేలా చేస్తాయి. దాంతోపాటు మేధావుల ప్రశంసలనూ అందుకుంటాయి. అందుకే సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మెరూ ఇంటర్నేషనల్ స్కూల్ తన విద్యార్థులకు అలాంటి అవకాశమిచ్చింది.
చిన్నారులకు అవకాశమిస్తే.. వారు తమ మేథా శక్తికి పదును పెడతారు. ఒక్కోసారి వారి ఆలోచనలు, ఆవిష్కరణలు పెద్దవారినే ఆశ్చర్యపోయేలా చేస్తాయి. దాంతోపాటు మేధావుల ప్రశంసలనూ అందుకుంటాయి. అందుకే సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మెరూ ఇంటర్నేషనల్ స్కూల్ తన విద్యార్థులకు అలాంటి అవకాశమిచ్చింది. దీంతో వారు తమలో ఉన్న అద్భుతమైన ఆలోచనలను ఆచరణలో పెట్టారు. దీంతో వాటన్నింటినీ కలిపి ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఆ ఆర్ట్ గ్యాలరి షో కి మైహోం గ్రూప్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అభినందించారు. పనికిరాని వస్తువులతో పిల్లలు అద్భుతాలు సృష్టించడం చాలా గొప్ప విషయం అని ప్రశంసించారు.
ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల ఆలోచనా విధానంలో మార్పు వస్తుందని అన్నారు. వ్యర్థాలను ఊరికే పడేయకుండా..వాటిని క్రియేటివ్‌గా ఎలా వినియోగించుకోవచ్చో ప్రపంచానికి దీని ద్వారా తెలుస్తుందని వివరించారు. విద్యార్థులతో పాటు మెరూ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యాన్నీ అభినందించారు. మన పరిసరాల్లోని వ్యర్థాలతోనే అద్భుతాలు సృష్టించొచ్చు అని మెరూ ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ జూపల్లి మేఘన తెలిపారు. స్కూల్ బస్‌ల టైర్‌లతో మంచి గ్యాలరీ తయారు చేసిన స్టాఫ్‌పై ఆమె ప్రశంసలు కురిపించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెరిగే అవకాశముంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి