AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: ఆటల్లో మునిగిన జనాలు.. పక్కనే ఉన్న పొదల నుంచి చప్పుళ్లు.. వెళ్లి చూడగా బాబోయ్..

Vizag: ఆటల్లో మునిగిన జనాలు.. పక్కనే ఉన్న పొదల నుంచి చప్పుళ్లు.. వెళ్లి చూడగా బాబోయ్..

Maqdood Husain Khaja
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 10, 2025 | 5:05 PM

Share

అది ఒక ఎంటర్టైన్మెంట్ జోన్.. రోజంతా ఆడుతూ పాడుతూ గడిపే ప్రాంతం.. ఒక్కసారిగా అలజడి..! అక్కడ సిబ్బందికి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అంతా వెతికారు.. ఎక్కడా ఏమీ కనిపించలేదు. కాస్త వెనక్కి వెళ్లి చూస్తే.. నిర్మానుష్య ప్రాంతంలోని పొదల వద్ద ఓ వల కదులుతూ ఉంది. దగ్గరికి వెళ్లి చూసిన వారికి గుండె పట్టుకునేంత పనైంది. ఆ వలలో చిక్కింది ఏంటో తెలుసా..!

అది ఒక ఎంటర్టైన్మెంట్ జోన్.. రోజంతా జనం ఆడుతూ పాడుతూ గడిపే ప్రాంతం.. ఒక్కసారిగా అలజడి..! అక్కడ సిబ్బందికి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అంతా వెతికారు.. ఎక్కడా ఏమీ కనిపించలేదు. కాస్త వెనక్కి వెళ్లి చూస్తే.. నిర్మానుష్య ప్రాంతంలోని పొదల వద్ద ఓ వల కదులుతూ ఉంది. దగ్గరికి వెళ్లి చూసిన వారికి గుండె పట్టుకునేంత పనైంది. ఆ వలలో చిక్కింది ఏంటో తెలుసా..!

విశాఖ పోర్ట్ స్టేడియంలో భారీ కొండ చిలువ భయపెట్టింది. ఎంటర్టైన్మెంట్ జోన్ వెనుక వైపు పొదల్లో.. పైథాన్ కనిపించింది. పొదలవైపు రక్షణగా ఉంచిన వాళ్లకు కొండచిలువ చిక్కుకుంది. ఎప్పటినుంచి చిక్కుకుందేమో గాని.. మెలికలు తిరుగుతూ శబ్దాలు చేస్తుంది. దీంతో అటుగా సిబ్బంది వెళ్లి చూడగా..  కొండచిలువ వలలో విలవిలాడుతూ కనిపించింది. దగ్గరకు వెళ్తే దాడి చేసేలా ఉంది. దీంతో స్నేక్ కేచర్ కిరణ్ కుమార్‌కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్.. వలలో చిక్కుకున్న ఆ పామును చాకచక్యంగా బయటకు తీశారు. వల వైర్లను కత్తిరించి పది అడుగుల పైగా పొడవున్న కొండచిలువను రక్షించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Published on: Sep 10, 2025 05:04 PM