Pepper-Ghee: నల్ల మిరియాల పొడిని నెయ్యిలో కలిపి తింటే ఎంత మేలో తెలుసా..?

ఆయుర్వేద వైద్యంలో నెయ్యి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. స్వచ్ఛమైన దేశీ నెయ్యితో బరువు తగ్గడం నుండి చర్మం, జుట్టు వరకు నెయ్యి చాలా విషయాలలో సహాయపడుతుంది. అయితే దీనికి కొన్ని ప్రత్యేక పదార్థాలను కలిపి తీసుకోవటం వల్ల నెయ్యి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఒక కాంబినేషన్ నల్ల మిరియాలు, నెయ్యి.

Pepper-Ghee: నల్ల మిరియాల పొడిని నెయ్యిలో కలిపి తింటే ఎంత మేలో తెలుసా..?

|

Updated on: Mar 13, 2024 | 4:58 PM

ఆయుర్వేద వైద్యంలో నెయ్యి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. స్వచ్ఛమైన దేశీ నెయ్యితో బరువు తగ్గడం నుండి చర్మం, జుట్టు వరకు నెయ్యి చాలా విషయాలలో సహాయపడుతుంది. అయితే దీనికి కొన్ని ప్రత్యేక పదార్థాలను కలిపి తీసుకోవటం వల్ల నెయ్యి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఒక కాంబినేషన్ నల్ల మిరియాలు, నెయ్యి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు నెయ్యి, నల్ల మిరియాలు కలయిక జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. నల్ల మిరియాలతో నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

నెయ్యి, నల్లమిరియాలు కలిపి తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరంలో దీర్ఘకాలిక మంట హృదయ సంబంధ వ్యాధులు తగ్గించడంలో నెయ్యి, నల్ల మిరియాల మిశ్రమం మంచి ఫలితాన్నిస్తుందంటున్నారు నిపుణులు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, నెయ్యిలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. అదనంగా, ఇది ఆరోగ్యకరమైన నిద్రకు దోహదం చేస్తుంది. నెయ్యి, నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల గుండె, కాలేయానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థ, మెదడు పనితీరులో మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి ని పెంచుతుంది. నల్లమిరియాలు, నెయ్యి మిశ్రమం కంటి చూపును మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. నెయ్యి, నల్ల మిరియాల కాంబినేషన్‌ శరీరం నుండి విషాన్ని తొలగించడం ద్వారా ప్రేగులను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఒక టీస్పూన్ దేశీ నెయ్యి, 1/2 టీస్పూన్ నల్ల మిరియాల పొడిని మిక్స్‌ చేసుకోవాలి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తింటే ఫలితం ఉంటుంది. ముఖ్య గమనిక ఏంటంటే.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాను తీసుకుంటే మంచిది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us