3 రోజులు.. 6 కోట్లు.. కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

|

Jan 16, 2025 | 7:52 PM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. మూడు రోజుల్లోనే 6 కోట్ల మందికిపైగా పుణ్య స్నానాలు ఆచరించారు. ఒక్క మకర సంక్రాంతి రోజునే మూడున్నర కోట్ల మందికిపైగా వచ్చినట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

సంక్రాంతి సందర్భంగా అఖాడాలు, ఆధ్యాత్మిక పీఠాల అధిపతులు, నాగా సాధువులు, సంతులు షాహి స్నాన్‌లో పాల్గొన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణీ, శ్రీ శంభు పంచాయతీ అటల్‌ అఖాఢా సాధువులు త్రివేణీ సంగమంలో తొలి స్నానాలు ఆచరించారు. వారిపై రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్‌ నుంచి పుష్పవర్షం కురిపించింది. తొలిరోజైన సోమవారం 1.65 కోట్ల మందికిపైగా పుష్య పూర్ణిమ స్నానాలు ఆచరించారు. మంగళవారం 3.5 కోట్లు, బుధవారం కూడా సుమారు కోటి మంది మంది దాకా భక్తులు త్రివేణి సంగమానికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక అత్యంత కీలకమైన మౌనీ అమావాస్య జనవరి 29న రానుంది. ఆ రోజు ఏకంగా 10 కోట్ల మంది కంటే అధికంగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ఆదేశించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హమ్మయ్య..యుద్ధం ఆగింది.. ఇక మోదీ కల నెరవేరినట్టే

రూ.100 కోట్లు కొల్లగొట్టిన డాకు.. బాలయ్యే కింగ్ ఆఫ్ సంక్రాంతి..

Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌పై దుండగుడి దా*డి.. 6 చోట్ల క*త్తిపోట్లు

50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌

TOP 9 ET News: వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్ | కలెక్షన్స్‌ కుమ్మడంలో ‘డాకు’ నెం1