Andhra Pradesh: టీచర్ ఉద్యోగం కోసం కౌన్సిలర్ పోస్టుకు రాజీనామా !!
పెద్ద పెద్ద ఉద్యోగాలకు రాజీనామా చేసే చాలా మంది రాజకీయాల్లోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఎమ్మెల్యే, ఎంపీ కాకపోయినా కనీసం వార్డు మెంబరో, సర్పంచో కావాలని కలలుగంటారు. అలాంటిది టీచర్ ఉద్యోగం కోసం ఒకావిడ మున్సిపల్ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి అందర్ని ఆశ్చర్యపరిచారు.
పెద్ద పెద్ద ఉద్యోగాలకు రాజీనామా చేసే చాలా మంది రాజకీయాల్లోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఎమ్మెల్యే, ఎంపీ కాకపోయినా కనీసం వార్డు మెంబరో, సర్పంచో కావాలని కలలుగంటారు. అలాంటిది టీచర్ ఉద్యోగం కోసం ఒకావిడ మున్సిపల్ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి అందర్ని ఆశ్చర్యపరిచారు. అది కాంట్రాక్ట్ బేసిస్‌లో టీచర్ ఉద్యోగం కోసం. ఈ విచిత్రమైన సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటుచేసుకుంది. మదనపల్లి మున్సిపాలిటీ 8వ వార్డు నుంచి గీతాశ్రీ టీడీపీ తరపున కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. టీచర్ ఉద్యోగం కోసం ఈమె 1998లో డీఎస్సీ పరీక్ష రాశారు. అప్పట్లోనే ఆమె సెలక్ట్ అయ్యారు. కాని రకరకాల కారణాలతో ఈమెకు అపాయింట్‌మెంట్ రాలేదు. తాజాగా ఈ నెల 13న గీతాశ్రీని టీచర్‌గా నియమిస్తూ చిత్తూరు DEO ఉత్తర్వులు జారీ చేశారు. తనకిష్టమైన టీచర్ ఉద్యోగం రావడంతో ఏ మాత్రం ఆలోచించకుండా గీతాశ్రీ తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను మదనపల్లి మున్సిపల్ కమిషనర్ వెంటనే ఆమోదించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hyderabad: గుర్రాన్ని కాపాడబోయి యవకులు మృతి ఇక్కడే !!
ముంబై-పుణే ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. షాకింగ్ వీడియో
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియా కస్టడీ పొడిగింపు
రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్
దైవసాక్షిగా సాగిన స్వాతంత్ర్య పోరాటానికి.. సజీవ సాక్ష్యం ఈ గ్రామం
రాచనాగుతో మామూలుగా ఉండదు మరి.. ఒకేరోజు రెండు కింగ్ కోబ్రాలు..
ఇంట్లో చోరీకి వచ్చి ఆ దొంగ చేసిన పనికి.. నవ్వకుండా ఉండలేరు!
రోడ్డు పై పులి ప్రత్యక్షం.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం
హాస్టల్లో దెయ్యం..! భయంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన విద్యార్ధినిలు
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు

