Tollywood News: టాలీవుడ్ షూటింగ్ అప్డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?
సంక్రాంతి పండుగ తర్వాత టాలీవుడ్ షూటింగ్స్ మళ్లీ ఊపందుకున్నాయి. మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు తమ సినిమాల చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. నాని 'ప్యారడైజ్' సహా పలు చిత్రాలు హలో నేటివ్ స్టూడియోలో షూట్ అవుతున్నాయి. గండిపేట, రామోజీ ఫిలిం సిటీ వంటి చోట్ల వెంకటేష్, విజయ్ దేవరకొండ వంటి హీరోల సినిమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సినిమా విశేషాలు, షూటింగ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.
సంక్రాంతి సందర్భంగా కొన్ని రోజులుగా షూటింగ్స్ పెద్దగా జరగట్లేదు. మెల్లగా ఆ బ్రేక్‌కు బ్రేక్ ఇచ్చి మళ్లీ షూటింగ్ వైపు వచ్చేస్తున్నారు హీరోలు. గత వారంతో పోలిస్తే ఈసారి షూటింగ్స్ సందడి పెరిగింది. మరి ఏ చిత్ర షూట్ ఎక్కడ జరుగుతుంది.. ఎవరెక్కడున్నారు.. ఖాళీగా ఉన్న హీరోలెవరో చూద్దామా..? హెలో నేటివ్ స్టూడియోలో ఈసారి షూటింగ్ సందడి బాగా కనిపిస్తుంది.. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ప్యారడైజ్ షూటింగ్ అక్కడే జరుగుతుంది. ఇక ఎమ్మెస్ రాజు సినిమా, సుడిగాలి సుధీర్ సినిమా, రాజహంస స్టూడియో నిర్మిస్తున్న జేడీ చక్రవర్తి సినిమా, శర్వానంద్ భోగి, దాసరి కళ్యాణ్ అధీరా సినిమాల షూటింగ్స్ అక్కడే జరుగుతున్నాయి. ఇక మహేష్ వారణాసి షూటింగ్ గండిపేటలో నాన్ స్టాప్‌గా జరుగుతుంది. అల్లు అర్జున్ AA22 షూట్ ముంబైలోనే 50 రోజులుగా జరుగుతుంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా షూటింగ్ అజీజ్ నగర్లో జరుగుతుంది. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ బేగంపేట్ చిరాగ్ పోర్టులో.. విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన షూటింగ్ గండిపేటలో బిజీ బిజీగా జరుగుతున్నాయి. CCL కారణంగా లెనిన్ షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చారు అఖిల్ అక్కినేని. ఇక సంక్రాంతి హీరోలంతా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. మరి సమ్మర్ సినిమాల పరిస్థితేంటి
Anil Ravipudi: అనిల్ రావిపూడి అంటే పేరు అనుకుంటివా.. హిట్టులకు బ్రాడ్
కొత్త ఏడాది.. కొత్త హీరోయిన్లు.. ఇండస్ట్రీ అంతా కొత్తదనమే
Prabhas: ప్రభాస్ ప్లాన్‌కు మైండ్ బ్లాక్.. ఇలాగైతే రికార్డులు కష్టమే
Varun Tej: వరుణ్ తేజ్ పరిస్థితి ఏంటి.. కనకరాజు కరుణిస్తాడా..?
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

