ఆసరా పెన్షన్లు తిరిగివ్వమని నోటిసులు.? బీఆర్ఎస్ నేత కేటీఆర్ షాకింగ్ పోస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దాసరి మల్లమ్మ 80 ఏళ్ల వృద్ధురాలు. అయితే ఆమెకు ఇచ్చిన ఆసరా పింఛను డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం రికవరీ నోటీసు జారీ చేసింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దాసరి మల్లమ్మ 80 ఏళ్ల వృద్ధురాలు. అయితే ఆమెకు ఇచ్చిన ఆసరా పింఛను డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం రికవరీ నోటీసు జారీ చేసింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆయన తన సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతాలో దీనికి సంబంధించి ఓ పోస్ట్ పెట్టారు. మల్లమ్మకు ప్రభుత్వం పంపిన నోటీసును, ఆమె ఫోటో తోపాటు జత చేశారు. మల్లమ్మకు ప్రభుత్వం పంపిన నోటీసును, ఆమె ఫోటో తోపాటు జత చేశారు. అనర్హులైనప్పటికీ రూ. 1,72,928ని పొందినందుకు ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం పేరిట ఆమెకు రికవరీ నోటీసు పంపినట్టు అందులో రాసి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Jul 14, 2024 08:49 AM
వైరల్ వీడియోలు
Latest Videos