5G phone call: ఇండియాలో మొదటి 5జీ కాల్ మాట్లాడింది ఎవరంటే..? స్వదేశీ తయారీ సక్సెస్..
కేంద్ర మంత్రి ఒకరు మొదటి 5జీ కాల్ మాట్లాడారు. తొలి 5జీ వీడియో కాల్ చేసిన ఘనత ఆ మంత్రికే దక్కుతుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యమైంది.
కేంద్ర మంత్రి ఒకరు మొదటి 5జీ కాల్ మాట్లాడారు. తొలి 5జీ వీడియో కాల్ చేసిన ఘనత ఆ మంత్రికే దక్కుతుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యమైంది. ‘ఆత్మనిర్భర్ 5జీ. ఐఐటీ మద్రాస్‌లో 5జీ కాల్‌ను విజయవంతంగా పరీక్షించాం. ఈ నెట్‌వర్క్ పూర్తిగా భారత్‌లోనే అభివృద్ధి చేశారు‘ అని గురువారం కాల్ అనంతరం కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దేశీయంగా 4జీ, 5జీ టెక్నాలజీలో పూర్తి సామర్థ్యాలు సాధించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష సాకారమైనట్లయిందని మంత్రి పేర్కొన్నారు. 5జీ టెక్నాలజీ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఉపయోగపడే టెస్ట్‌బెడ్‌ను ఐఐటీ మద్రాస్‌లో ప్రధాని మంగళవారమే ఆవిష్కరించారు. ప్రస్తుతం టెలికం కంపెనీలు ప్రయోగాత్మకంగానే 5జీ సేవలను పరీక్షిస్తున్నాయి. ఇవి ఈ ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్‌లలో అందుబాటులోకి రాగలవన్న అంచనాలు ఉన్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!
killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..