కరోనాను కట్టడి చేస్తున్న కొత్త మందు.. మాత్ర రూపంలో వస్తున్న కోవిడ్‌ మెడిసిన్‌.. వీడియో

కరోనా బాధితులకు మరో గుడ్ న్యూస్. ఇకపై ఈ మహమ్మారిని ఎదుర్కునే ఔషధాలు మాత్రల రూపంలో రానున్నాయి. కోవిడ్-19ను ఎదుర్కునేందుకు వ్యాక్సిన్ వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ఔషధాలపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.

కరోనాను కట్టడి చేస్తున్న కొత్త మందు.. మాత్ర రూపంలో వస్తున్న కోవిడ్‌ మెడిసిన్‌.. వీడియో

|

Updated on: Oct 07, 2021 | 7:51 AM

కరోనా బాధితులకు మరో గుడ్ న్యూస్. ఇకపై ఈ మహమ్మారిని ఎదుర్కునే ఔషధాలు మాత్రల రూపంలో రానున్నాయి. కోవిడ్-19ను ఎదుర్కునేందుకు వ్యాక్సిన్ వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ఔషధాలపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా సంస్థ ‘మెర్క్’.. రిడ్‌బ్యాక్ బయోథెరపీటిక్స్ సహకారంతో ‘మోల్నుపిరవిర్’ అనే ఔషధాన్ని తయారు చేసింది. ఈ ఔషధంపై నిర్వహించిన క్లినికల్ ట్రయిల్స్‌లో మెరుగైన ఫలితాలు వచ్చినట్లు తెలిపింది. మరణాల సంఖ్యతో పాటు కొత్తగా వైరస్ బారిన పడుతోన్న వారి సంఖ్యను కూడా 50 శాతం వరకు తగ్గించినట్లు సంస్థ తెలిపింది. త్వరలోనే ఈ ఔషధాన్ని మాత్రల రూపంలో అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేయనున్నట్లు మెర్క్ ఫార్మా ప్రకటించింది. రిడ్జ్‌బ్యాక్ బయోథెరపిక్స్, మెర్క్ ఫార్మా సంస్థలు కలిసి సంయుక్తంగా ‘మోల్నుపిరవిర్’ ఔషధంపై క్లినికల్ ట్రయిల్స్ నిర్వహించాయి. 775 మంది వాలంటీర్లపై ఈ ప్రయోగాలను నిర్వహించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Tabernaemontana: కంటిచూపు మెరుగు పరిచే దివ్య ఔషధం నందివర్దనం.. వీడియో

Funny Video: ఇదేం తమాషా బాబు..! పెళ్లిరోజు వరుడికి సాస్‌తో తలంటు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Follow us