Big Bazaar: ఇకపై బిగ్‌బజార్ ఉండదు.. ఎందుకంటే.. ఎప్పటి నుండి అంటే..?(వీడియో)
రిలయన్స్ రిటైల్ కొత్త రిటైల్ స్టోర్ "బ్రాండ్ స్మార్ట్ బజార్" ను ప్రారంభించబోతోంది. ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన బిగ్ బజార్ అవుట్‌లెట్ల పేరును బ్రాండ్ స్మార్ట్ బజార్‌గా మార్చాలని నిర్ణయించింది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగం
రిలయన్స్ రిటైల్ కొత్త రిటైల్ స్టోర్ “బ్రాండ్ స్మార్ట్ బజార్” ను ప్రారంభించబోతోంది. ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన బిగ్ బజార్ అవుట్‌లెట్ల పేరును బ్రాండ్ స్మార్ట్ బజార్‌గా మార్చాలని నిర్ణయించింది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగం దాదాపు 950 ప్రాపర్టీలలో తన సొంత స్టోర్లను తెరవడానికి పని చేస్తోందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. నివేదిక ప్రకారం, కొన్ని స్మార్ట్ బజార్ స్టోర్‌లతో సహా పలు ప్రదేశాల్లో కనీసం 100 స్టోర్‌లను తెరవాలని కంపెనీ యోచిస్తోంది. మార్చి నెలలో వీటిని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ నివేదికపై రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ ఇంకా స్పందించలేదు.రిలయన్స్ రిటైల్.. స్మార్ట్ బజార్ రోజువారీ దుస్తులు, సాధారణ వస్తువులపై ఎక్కువ దృష్టి పెడుతుందని అధికారులు తెలిపారు. ఇవి బిగ్ బజార్ తరహాలో రూపొందించనున్నారు. సెంట్రల్ వంటి పెద్ద ఫ్యూచర్ గ్రూప్ స్టోర్‌లు 60,000 చదరపు అడుగుల నుంచి 100,000 చదరపు అడుగుల వరకు విస్తరించి ఉండటంతో.. ఇక్కడ రిలయన్స్ మాల్ దాని ప్రస్తుత బ్రాండ్లను తీసుకువస్తుంది. కాగా అదనంగా ఫ్యూచర్ గ్రూప్ ఫ్రాంచైజీగా సెంట్రల్ ఫార్మాట్‌ను నిర్వహించాలని ఫ్యూచర్ గ్రూప్ రిలయన్స్‌కు ప్రతిపాదించింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)