Computer Worm Virus: అమ్మో.. ఈ వర్మ్.. వైరస్ కంటే డేంజరట.. వస్తే వదిలేదీ లే..

కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల యుగంలో వైరస్‌లు, మాల్వేర్ల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వైరస్ కంటే ప్రమాదకారి అంటూ వర్మ్ గురించి నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. వైరస్, వర్మ్..

Computer Worm Virus: అమ్మో.. ఈ వర్మ్.. వైరస్ కంటే డేంజరట.. వస్తే వదిలేదీ లే..

|

Updated on: Jul 03, 2022 | 3:55 PM


కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల యుగంలో వైరస్‌లు, మాల్వేర్ల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వైరస్ కంటే ప్రమాదకారి అంటూ వర్మ్ గురించి నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. వైరస్, వర్మ్.. ఇవి రెండూ కూడా మాల్వేర్ రకాలే అయినా, రెండింటికీ తేడా ఉంది. మాల్వేర్లు ఓ సిస్టమ్ లో అక్రమంగా చొరబడి అక్కడి వ్యవస్థలను తన అధీనంలోకి తెచ్చుకుని, తీవ్ర నష్టం కలుగజేస్తాయంటున్నారు. వైరస్ లు, ట్రోజన్లు, వర్మ్ లు మాల్వేర్లు, యాడ్వేర్ లు, స్పైవేర్లలో రకాలే. వైరస్ లో ఎంతో నష్టం కలుగజేస్తాయనుకుంటే, వర్మ్ లు అంతకంటే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. మాల్వేర్లో అత్యంత విరివిగా ప్రాచుర్యంలో ఉండేది ఈ వైరస్ లే. ఈ వైరస్ వ్యాప్తి చెందాలంటే ఓ ఆధారం హోస్ట్ తప్పనిసరి. అది ఓ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ రూపంలోనో, డాక్యుమెంట్ రూపంలోనో, లేక ఏదైనా కంప్యూటర్ ప్రోగ్రామ్ రూపంలోనో ఉండొచ్చు. వైరస్ దాన్ని ఉపయోగించుకుని ఒక సిస్టమ్ మొత్తం వ్యాపిస్తుంది. ప్రోగ్రాం లేదా ఆపరేటింగ్ సిస్టమ్ లో మార్పులు చేసి, సిస్టమ్ లోని వ్యవస్థలను చెడగొడుతుంది. కొన్నిసార్లు ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ లోనూ, ఎస్సెమ్మెస్ రూపంలోనూ వైరస్ ప్రవేశిస్తాయి. కానీ వర్మ్ అలా కాదు… ఇది మన కంప్యూటర్ లోనూ, స్మార్ట్ ఫోన్ లోనూ ప్రవేశించిందంటే చాలు… క్లిక్ చేయకుండానే తన పని ప్రారంభిస్తుంది. సిస్టమ్ లోకి ఇది ఎంటర్ అయిందంటేనే నష్టం మొదలైనట్టు భావించాలంటున్నారు నిపుణులు. అంతేకాదు, యూజర్ చర్యలతో సంబంధం లేకుండా సిస్టమ్ అంతటా వ్యాపించడమే కాదు, ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టమ్ కు పాకుతుంది. అందుకే, వైరస్ కంటే వర్మ్ తోనే ఎక్కువ నష్టం అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, సిస్టమ్ లకు తగినంత భద్రత ఏర్పాటు చేసుకోవాలని, ఎప్పుటికప్పుడు సిస్టమ్ ను చెక్ చేస్తుండాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Follow us