AP News: చంద్రబాబు, లోకేష్ తెలుగుదేశం పార్టీని మడతపెట్టారు: కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..
టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి తారకరామారావు పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. అలాంటి పార్టీని తండ్రి, కొడుకులు కలిసి కుర్చీ మడతపెట్టడం కాదు ఏకంగా టీడీపీ పార్టీనే మడతపెట్టేశారన్నారు. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో లేకపోవడం ఊహించారా అని ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి తారకరామారావు పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. అలాంటి పార్టీని తండ్రి, కొడుకులు కలిసి కుర్చీ మడతపెట్టడం కాదు ఏకంగా టీడీపీ పార్టీనే మడతపెట్టేశారన్నారు. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో లేకపోవడం ఊహించారా అని ప్రశ్నించారు. 41ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు. తెలంగాణలో టీడీపీ సున్నా అని చెబుతూ ప్రస్తుతం రాజ్యసభ సీట్లలో సున్నా అని ఎద్దేవ చేశారు. ఇదే విధంగా రేపు వచ్చే ఏపీ ఎన్నికల్లో కూడా టీడీపీకి సున్నానే అని జోస్యం చెప్పారు కేశినేని నాని. ఏపీలో ఎన్నికల అనంతరం చంద్రబాబు, లోకేష్ కుర్చీ మడతపెట్టుకోని తెలంగాణ వెళ్ళిపోతారని విమర్శించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
Latest Videos