ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక భాషల ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా కోర్టులు కూడా మాతృభాష వైపు అడుగులు వేస్తున్నాయి. తొలిసారిగా తెలుగులో తీర్పు వెలువరించి ఏపీ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. రెండు సివిల్ కేసులకు సంబంధించి విచారణ చేపట్టిన జస్జిస్ మన్మథరావు నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించారు. పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన రెండు సివిల్ కేసుల విచారణ జరిపింది ఏపీ హైకోర్టు. విచారణ అనంతరం తెలుగులో తీర్పు చదివి వినిపించారు న్యాయమూర్తి మన్మథరావు. ఇటీవల క్రింది స్థాయి కోర్టులు స్థానిక భాషల్లో ఆదేశాలు ఇవ్వచ్చొని సుప్రీం సూచించింది. ఈనేపథ్యంలోనే ఇష్టపూర్వకంగా తెలుగులో తీర్పు చదివి వినిపించారు న్యాయమూర్తి. తీర్పుకు సంబంధించిన తెలుగు ఆర్డర్ కాపీని వెబ్ సైట్‌లో పెట్టింది హైకోర్టు. వాస్తవానికి సుప్రీం కోర్టు, హైకోర్టులు తీర్పులను అందరికీ అర్థమయ్యే ఇంగ్లిష్‌లోనే వెలువరించాల్సి ఉంటుంది. సాక్ష్యాధారాలు, ఇతర పత్రాలు స్థానిక భాష లో ఉంటే వాటిని ఇంగ్లిష్‌లోని అనువదించి ధర్మాసనానికి అందించాలి. లేకపోతే సుప్రీం కోర్టు, హైకోర్టుల రిజిస్ట్రీలు పిటిషన్లను స్వీకరించవు. అలాంటిది.. రాష్ట్ర హైకోర్టు చరిత్రలోనే తొలిసారి తెలుగులో తీర్పు చెప్పి, కొత్త చరిత్ర లిఖించారు న్యాయమూర్తి. ఏపీ హైకోర్టు నిర్ణయంపై తెలుగు భాషాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..