గ్యాస్‌ సిలిండ‌ర్ల లారీని ఢీకొన్న పాల ట్యాంక‌ర్‌.. తర్వాత

Updated on: Oct 09, 2025 | 8:08 PM

జైపూర్–అజ్మీర్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. దూదూ పరిధిలోని మౌజుమాబాద్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లతో నిండిన లారీ హైవేపై నిలిచివుండగా, వెనుకనుంచి వేగంగా వచ్చిన పాల ట్యాంకర్ ఢీ కొట్టింది. ఢీకొట్టిన ప్రభావంతో ఎల్పీజీ లారీ తలకిందులై మంటలు చెలరేగాయి. వరుసగా సిలిండర్ పేలుళ్లు సంభవించాయి.

పేలుళ్ల శబ్దాలు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వినిపించాయి. సిలిండర్లు దాదాపు 200 మీటర్ల దూరం వరకూ ఎగిరి పడ్డాయి. మంటల్లో పలు వాహనాలు చిక్కుకున్నాయి. ఈ ఘటన జైపుర్‌-అజ్మీర్‌ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి రాత్రి చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన సిలిండ‌ర్ల ట్రక్కు డ్రైవ‌ర్‌ను ప్రాథ‌మిక చికిత్స కోసం స‌మీప ఆస్పత్రికి కి తరలించారు. సీఎం భ‌జ‌న్‌లాల్ శ‌ర్మ ఆదేశాలతో డిప్యూటీ సీఎం ప్రేమ్ చాంద్ బైర్వా ఘ‌ట‌నా స్థలిని సంద‌ర్శించారు. ప్రస్తుతం అక్కడ ప‌రిస్థితి అదుపులోనే ఉన్నట్టు సమాచారం. దుడా ఏరియాలో జ‌రిగిన ప్రమాద ప్రదేశానికి పోలీసు అధికారులు, అగ్నిమాప‌క సిబ్బంది చేరుకుని హైవేపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ట్యాంకర్‌ డ్రైవ‌ర్లు, క్లీన‌ర్లు మిస్సింగ్‌లో ఉన్నట్లు బైర్వా తెలిపారు. వాళ్లను ప‌ట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేప‌ట్టారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు. ఎల్‌పీజీ సిలిండ‌ర్లు వెళ్తున్న ట్రక్కు ఓ హోట‌ల్ బ‌య‌ట పార్కింగ్ చేసి ఉంద‌ని, ఆ స‌మ‌యంలో డ్రైవ‌ర్ భోజ‌నం చేస్తున్నాడ‌ని, అయితే వెనుక నుంచి వ‌చ్చిన ట్యాంక‌ర్ దాన్ని ఢీకొట్టింద‌ని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో కూడా జైపూర్ హైవేపైనే ఎల్‌పీజీ ట్యాంక‌ర్‌ను ఓ ట్రక్కు ఢీకొంది. ఆ స‌మ‌యంలో భారీగా మంట‌లు వ్యాపించాయి. ఆ ప్రమాదంలో సుమారు 19 మంది మ‌ర‌ణించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గాజుల షాపులో నాగుపాము.. కస్టమర్ల పరుగో పరుగు

బట్టలుతుకుతున్న మహిళ.. హఠాత్తుగా మొసలి ఎంట్రీ.. ఆమెను నదిలోకి లాక్కెళ్లి

Lalitha Jewellery: లలిత జువెలరీకి అరుదైన గౌరవం..

భారీ సెంచరీ చేసి సహచరుడిని కొట్టబోయిన పృథ్వీషా

కమ్ బ్యాక్ కోసం కుర్ర హీరోల తంటాలు