AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐఆర్‌సీటీసీ బిగ్ ఆపరేషన్.. 3 కోట్ల అకౌంట్లు బ్లాక్

ఐఆర్‌సీటీసీ బిగ్ ఆపరేషన్.. 3 కోట్ల అకౌంట్లు బ్లాక్

Phani CH
|

Updated on: Jun 06, 2026 | 5:59 PM

Share

టికెట్ బుకింగ్ మోసాలను అరికట్టేందుకు ఐఆర్‌సీటీసీ దేశవ్యాప్తంగా భారీ చర్యలు చేపట్టింది. 3 కోట్ల అనుమానాస్పద అకౌంట్లను నిలిపివేయగా, మరో 6 కోట్ల ఖాతాలను పరిశీలిస్తోంది. అదే సమయంలో రైల్వే కిచెన్లలో ఆహార భద్రత కోసం ఏఐ ఆధారిత స్మార్ట్ కెమెరాలను ఏర్పాటు చేసింది. సిబ్బంది నిబంధనల ఉల్లంఘనలు, పరిశుభ్రత లోపాలను వెంటనే గుర్తించి అధికారులకు అలర్ట్ పంపే వ్యవస్థను అమలు చేస్తోంది.

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం ఐఆర్‌సీటీసీ ప్రయాణికులకు షాకిస్తూ భారీ ఆపరేషన్‌కు తెరలేపింది. టికెట్ బుకింగ్స్‌లో జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేసేలా, ప్రయాణికులకు కన్ఫమ్ టికెట్లు అందించే లక్ష్యంతో సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా కోట్ల కొద్దీ అనుమానాస్పద అకౌంట్లపై వేటు వేస్తోంది. ఇక రైల్వే కిచెన్లలో ఆహార భద్రతను పర్యవేక్షించడానికి ఏఐ సాంకేతికతను రంగంలోకి దించింది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న వారి అకౌంట్లను ఐఆర్‌సీటీసీ క్లోజ్‌ చేసింది . వ్యవస్థలో పారదర్శకత కోసం 3 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను పూర్తిగా నిలిపేసింది. మరో 6 కోట్ల అకౌంట్ల వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టింది. మొత్తం మీద 9 కోట్ల ఖాతాలపై ఐఆర్‌సీటీసీ అధికారులు విచారణ జరుపుతున్నారు. అంతేకాదు జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో PNR నెంబర్లపై 501 ఫిర్యాదులు నమోదయ్యాయి. 13,300 నకిలీ ఈమెయిల్ డొమైన్లను బ్లాక్ చేసింది. ప్రయాణికులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం కోసం ఐఆర్‌సీటీసీ కొత్త ప్రయోగం చేస్తోంది. 800కు పైగా రైల్వే కిచెన్స్‌లో ఏఐ ఆధారిత స్మార్ట్ కెమెరాలను అమర్చారు. అవి ఆహార తయారీని ప్రతి క్షణం పర్యవేక్షిస్తాయి. సిబ్బంది తలకు క్యాప్ పెట్టుకోకపోయినా, చేతులకు గ్లౌజులు వేసుకోకపోయినా, వంటగదిలో ఈగలు, దోమలు, బొద్దింకలు, ఎలుకలు తిరిగినా కెమెరాలు వెంటనే పసిగడతాయి. కేవలం 7 నుంచి 8 మిల్లీమీటర్ల చీమను సైతం గుర్తించడం ఆ సిస్టమ్ ప్రత్యేకత. వంటగదుల నుంచి వచ్చే సీసీటీవీ ఫుటేజీని మెషిన్ లెర్నింగ్ ద్వారా ఏఐ సిస్టమ్ విశ్లేషిస్తుంది. నిబంధనల ఉల్లంఘన జరిగితే వెంటనే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒకవేళ ఆ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే, ఉన్నతాధికారులకు అలర్ట్ వెళ్తుంది. రెండు గంటల్లో బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం ఈ సిస్టమ్ రోజుకు సగటున 350 అలర్ట్‌లను ఇస్తోంది. భవిష్యత్తులో ఏఐ నిఘా నెట్‌వర్క్‌ను మరిన్ని కిచెన్‌లకు విస్తరించనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఐఆర్‌సీటీసీ ఏకంగా 60 కోట్ల మంది ప్రయాణికులకు భోజన సదుపాయాన్ని అందించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెట్టుపైనుంచి నోట్ల వర్షం కురిపించిన కోతి.. వానరం ఎంత పని చేసింది!

ఏఐ వద్దు.. ఉద్యోగులే ముద్దు.. పెరిగిన ఏఐ ఖర్చు.. కంపెనీల పునరాలోచన

రోడ్డుపై కరెన్సీ నోట్లు విసిరేసి.. ఓ రేంజ్‌లో పోలీస్‌ దొంగా ఛేజింగ్

90 ఏళ్ల అత్తగారిని బుట్టలో కూర్చోబెట్టి.. నెత్తిన పెట్టుకుని కోడలి పాదయాత్ర!

పక్క ఫ్లాట్‌ను దొంగచాటుగా రికార్డ్ చేస్తూ పట్టుబడ్డ వృద్ధుడు

Follow Us