Kerala: హీటెక్కిన కేరళ.. 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.
కేరళ హీటెక్కింది. సమ్మర్ ప్రభావం అప్పుడే మొదలైంది. ఫిబ్రవరిలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. కేరళలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎండలు దంచికొడుతున్నాయి. ఆరు జిల్లాలకు వార్నింగ్ వాతావరణశాఖ వార్నింగ్ ఇచ్చింది. ఎర్నాకుళం, త్రిసూర్, కన్నూరు, అలప్పుజా, కొట్టాయం, కోజికోడ్ జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతున్నాయి.
కేరళ హీటెక్కింది. సమ్మర్ ప్రభావం అప్పుడే మొదలైంది. ఫిబ్రవరిలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. కేరళలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎండలు దంచికొడుతున్నాయి. ఆరు జిల్లాలకు వార్నింగ్ వాతావరణశాఖ వార్నింగ్ ఇచ్చింది. ఎర్నాకుళం, త్రిసూర్, కన్నూరు, అలప్పుజా, కొట్టాయం, కోజికోడ్ జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతున్నాయి. వాతావరణశాఖ హెచ్చరిక ప్రకారం ఎర్నాకుళం, త్రిసూర్, కన్నూరు జిల్లాల్లో అత్యధికంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. అలప్పుజా, కొట్టాయం, కోజికోడ్ జిల్లాల్లో 36 డిగ్రీలు నమోదైనట్టు ఐఎండీ తెలిపింది. సాధారణ స్థాయి కన్నా.. సుమారు 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఆ జిల్లాల్లో నమోదు కానున్నట్లు ఐఎండీ తన అలర్ట్‌లో పేర్కొంది. నిజానికి మార్చి నుంచి జూన్ మధ్య కాలంలో కేరళలో అధిక ఉష్ణోగ్రతలే ఉంటాయి. కానీ ఈసారి ఫిబ్రవరిలోనే వెదర్ వేడెక్కినట్లు తెలుస్తోంది. వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు తగిన చర్యలు తీసుకోవాలని కేరళ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..