Telangana Weather Update: తెలంగాణను వణికిస్తున్న చలి
తెలంగాణపై చలి పంజా విసురుతోంది. నవంబర్ 10 నుండి తీవ్రత పెరిగి, రాత్రి ఉష్ణోగ్రతలు 9-14°C కి పడిపోతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, వెచ్చని దుస్తులు ధరించి, వేడి ఆహారం తీసుకోవాలి. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. చలి నుండి రక్షణకు మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంపై చలి పంజా విసురుతోంది. శనివారం నుంచే రాష్ట్రంలో చలి ప్రారంభం కాగా.. నవంబర్ 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రోజుల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. శనివారం రాత్రి నుంచే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా బేలలో 14.7 డిగ్రీల సెల్సియస్, రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 14.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ కేంద్రం రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చలి నుంచి తమను తాము కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. చలిని తట్టుకునేందుకు స్వెటర్లు, జాకెట్లు, మఫ్లర్‌లు ధరించాలి. శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే విధంగా దుస్తులు ధరించాలని, వేడి సూప్‌లు, గోరువెచ్చని నీరు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు వేకువజామున, రాత్రి పొద్దుపోయాక బయటకు వెళ్లవద్దని వారు సలహా ఇస్తున్నారు. చలి వల్ల చర్మం పగలడం, పొడిబారడం జరగకుండా నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలని సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్లామర్ షో చాలు.. ఇక నటిస్తామంటున్న కుర్ర హీరోయిన్లు
Pawan Kalyan: కథలు రెడీ.. పవన్ రెడీగా ఉన్నారా
ముంబైలోనే సెటిల్ అవ్వాలని చూస్తున్న ఆ హీరోయిన్లు
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో
ఆటోడ్రైవర్ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా వీడియో
మెస్సి పేరుతో టీ స్టాల్.. ఫుట్‌బాల్ స్టార్ ను కలిసే అవకాశం వీడియో
ఇదేం విచిత్రం.. మండు వేసవి ముందే వచ్చిందా వీడియో
మీరు గ్రేట్ సార్ ఓటు కోసం విమానంలో వచ్చి వీడియో
పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో
రైల్వే సంచలన నిర్ణయం వీడియో

