Hyderabad: ఆ పురాతన కట్టడంలో బంగారు నిక్షేపాలున్నాయా? కాలనాగులు రక్షణగా ఉన్నాయా?
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ముషక్ మహల్‌లో గుప్త నిధులున్నాయా? దీనికి కాలనాగులు రక్షణగా ఉన్నాయా? ఇప్పుడిదే హాట్ టాపిక్.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ముషక్ మహల్‌లో గుప్త నిధులున్నాయా? దీనికి కాలనాగులు రక్షణగా ఉన్నాయా? ఇప్పుడిదే హాట్ టాపిక్. గోల్కొండను నిర్మించిన కాలం(17వ శతాబ్ధం)కు చెందిన ముషక్ మహల్ భవనం లోపలికి వెళ్లిన కొందరు స్థానిక యువకులు.. అందులో ఓ చిన్న సొరంగాన్ని గుర్తించారు. అందులో గుప్తనిధులు ఉండొచ్చన్న నమ్మకంతో దాని లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. 11 అడుగుల భారీ సర్పం కనిపించింది. దీంతో ఆ యువకులు బయటకు పరుగులు తీశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ భవనంలోని సొరంగం ఎక్కడి వరకు ఉందన్న చర్చ మొదలయ్యింది. సొరంగం లోపల భారీగా గుప్త నిధులు దాచి ఉంచొచ్చన్న అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు స్థానికులు. ఆ బంగారు నిక్షేపాలకు కాలనాగులు కాపలాగా ఉండొచ్చని మాట్లాడుకుంటున్నారు. ఇందులో నిజానిజాలను ప్రభుత్వ అధికారులు నిగ్గు తేల్చాలని స్థానికులు కోరుతున్నారు.