రూ. 10 కోట్లకు విల్లా.. హైదరాబాద్‌లో భారీ డిమాండ్‌

Edited By: Phani CH

Updated on: Nov 29, 2025 | 12:35 PM

హైదరాబాద్‌లో విల్లాలు, లగ్జరీ అపార్ట్‌మెంట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఐటీ ఉద్యోగులు కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తూ, తమ కార్యాలయాలకు దగ్గరగా ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. విల్లాలు స్టేటస్ సింబల్‌గా మారడంతో, కాలుష్య రహిత వాతావరణంలో నివసించడానికి కోటి రూపాయల వరకు వెచ్చించేందుకు వెనుకాడటం లేదు. షంషాబాద్, కిస్మత్‌పూర్‌లలో విల్లా నిర్మాణాలు పెరిగాయి.

హైదరాబాద్‌లో విల్లాలకు క్రేజ్ ఎక్కువైపోయింది. కనెక్టివిటీ ఉంటే చాలు.. ఎంత దూరమైనా విల్లాలు కొనేస్తున్నారు ఐటీ ఉద్యోగులు. హైదరాబాద్‌ మహానగరం నలువైపులా విస్తరిస్తోంది. భారీ భవన నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్స్‌‌లో హైరైజ్‌ బిల్డింగ్స్‌ సంఖ్య విపరీతంగా పెరిగింది. కోకాపేట, నానక్‌ రాంగూడ, నార్సింగి, గచ్చిబౌలి ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. రాయదుర్గంలో ఎకరా 177 కోట్ల రూపాయలు పలికింది. సాఫ్ట్‌‌వేర్‌ కంపెనీలకు కూత వేటు దూరంలో ఉన్న ఈ ప్రాంతమంతా అద్దాల మేడలతో రంగుల ప్రపంచంగా మారిపోయింది. విద్యుత్‌ కాంతులతో మెరిసిపోతుంది. కాస్ట్‌‌లీ ఏరియాలో లగ్జరీ అపార్ట్‌‌మెంట్స్‌‌కు భారీగా డిమాండ్‌ ఉంది. టెకీలు.. తమ కార్యాలయాలకు దగ్గరలో ఉండే విధంగా ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు పక్కనే ఉండటం, ఆఫీస్‌‌కు దగ్గరలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. లగ్జరీ అపార్ట్‌‌మెంట్స్‌‌కు క్రేజ్ పెరిగిందని.. దీంతో వీటి అమ్మకాల సంఖ్య పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు విల్లాల కల్చర్‌ కూడా పెరిగిపోయింది. విల్లా అనేది స్టేటస్‌ సింబల్‌‌గా మారిపోయింది. అయితే పది కోట్ల రూపాయల వరకు వెచ్చించి విల్లాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కనెక్టివిటీ ఉంటే చాలు ఎంత దూరమైన వెళ్లి విల్లా కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. కాలుష్య భూతానికి దూరంగా విల్లాల్లో విలాసవంతంగా జీవించేందుకు హైదరాబాదీలు మక్కువ చూపిస్తున్నారు. ఆఫీస్‌‌లకు దగ్గరగా ఉండాలని కోరుకునేవారు తప్పనిసరి పరిస్థితుల్లో లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ చూస్తున్నారు. శంషాబాద్‌, కిస్మత్‌‌పూర్‌, కొంపల్లి ప్రాంతాల్లో విల్లాల నిర్మాణాలు పెరిగిపోయాయి. డిమాండ్‌ మేరకే నిర్మాణాలు కొనసాగుతున్నాయని రియాల్టర్లు చెబుతున్నారు. విల్లాలు, అపార్ట్‌‌మెంట్స్‌ అమ్మకాల్లో దేని డిమాండ్‌ దానికే ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిచ్చెన ఎక్కితేనే బ్యాంకు సేవలు.. డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా రిస్క్‌ చేస్తేనే

పెరుగుతున్న డయాబెటిస్‌ కేసులు.. స్కిన్‌ క్రీమ్‌ రూపంలో ఇన్సులిన్‌

Pit Bull: పిట్‌ బుల్స్‌ దాడిలో యువతి మృతి

Dhoni: కోహ్లీ కోసం డ్రైవర్‌గా మారిన ధోనీ..ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ

సంక్రాంతి ఎఫెక్ట్.. హైదరాబాద్- వైజాగ్ బస్ టికెట్.. రూ. 7000