సత్యసాయి ట్రస్ట్ మొక్కలు నాటుతుంటే.. కరెంటోళ్లు చెట్లు నరికేస్తున్నారు

|

Dec 12, 2024 | 8:59 PM

చెట్లు పర్యావరణాన్ని కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గాలి ఎంతో అవసరం. ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా పొల్యూషన్‌ తాండవం చేస్తోంది. ఈ పొల్యూషన్‌ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే చెట్లను పెంచాలి. అందుకే ప్రభుత్వాలు కూడా హరితహారం కార్యక్రమంలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ చెట్లను పెంచడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు.

అలాగే చెట్లను నాటుతుంటారు. అయితే ఈ చెట్లను పలు కారణాలతో నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నారు. తాజాగా సత్యసాయి జిల్లాలో విద్యుత్‌ లైన్ల ఏర్పాటు పేరుతో రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షాలను నరికేస్తున్నారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో విద్యుత్తు లైన్ల ఏర్పాటు పేరుతో భారీ వృక్షాలను నరికేస్తున్నారు విద్యుత్‌ శాఖ సిబ్బంది. లైన్లకు అడ్డుగా ఉన్న కొమ్మలు ట్రిమ్మింగ్ కు మాత్రమే అనుమతులు తీసుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్నాయంటూ చెట్లను ఇష్టం వచ్చినట్లు నరికి వేస్తుండటంతో స్థానికులు, పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. పచ్చని చెట్లను నేలకూల్చొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్యాన్సర్‌ను కూడా తరిమికొట్టే అద్భుతమైన పండు ఇదే !!

42 గంటల్లో గమ్యం చేరాల్సిన రైలు.. మూడున్నరేళ్లకు చేరింది

అరుదైన పాము ప్రత్యక్షం.. తక్షక వంశానికి చెందిన నాగుగా నిర్ధారణ

అమెజాన్‌లో తెలుగు కుర్రాడికి జాక్‌పాట్‌.. ప్యాకేజ్ ఎంతో తెలుసా ??

జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. శాశ్వతంగా దానికి దూరమే !!