Vizag: వాష్‌రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఊహించని సీన్.. ఒక్కసారిగా భారీ శబ్దాలతో..
విశాఖకు చెందిన ఒక కుటుంబం ఊరెళ్ళింది. మూడు రోజులపాటు క్యాంపు కంప్లీట్ చేసుకుని తిరిగి వచ్చారు ఆ కుటుంబ సభ్యులు. ఇంట్లోకి వెళ్లి కాస్త రిలాక్స్ అయ్యారు. ఆ తర్వాత వాష్ రూమ్‌కు వెళ్దామని సిద్ధమై బాత్రూం తలుపు తీశారు. అంతే.! గుండెలు పట్టుకొని పరుగులు తీసే పరిస్థితి ఎదురైంది. ఆమె పరుగులు పెడుతూ కేకలు వేయడంతో కుటుంబ సభ్యులంతా వచ్చి చూశారు.
విశాఖ మల్కాపురం జయేంద్ర కాలనీలో శాంతి అనే మహిళ తన భర్త, కుటుంబసభ్యులతో పాటు నివాసముంటోంది. ఆమె ఇటీవల కుటుంబ సభ్యులతో సహా క్యాంప్‌కు వెళ్లింది. ఇంటికి తాళాలు వేసుకుని బయలుదేరారు. మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చారు. తలుపు తాళం తీసి లోపలికి వెళ్లి.. సామాన్లు అన్ని సర్దేసింది. ఆ తర్వాత కాళ్లు, చేతులు కడుక్కునేందుకు వాష్ రూమ్ వైపు వెళ్లింది. తలుపు తీయగానే.. ఏదో అక్కడ ఉన్నట్టు గుర్తించింది. చీకటిలో తాడులా కనిపించినా.. కాస్త కళ్లు తడుముకుని చూసేసరికి భారీ కొండచిలువ కనిపించింది. తిష్ట వేసుకుని కూర్చుని శబ్దాలు చేస్తోంది. దీంతో ఆ భారీ కొండచిలువను చూసి అరుపులు, కేకలు పెడుతూ బయటకు పరుగులు తీసింది సదరు మహిళ.
ఇక ఆమె కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి.. లోపల భారీ కొండచిలువ కనిపించింది. వెంటనే గుండెలు పట్టుకుని.. స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన నాగరాజు అండ్ టీం.. భారీ కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. కొండచిలువ 9 అడుగులు ఉండటాన్ని చూసి స్థానికుల గుండె ఆగినంత పనైంది. ఆ కొండచిలువను బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు

