బంగాళాఖాతంలో అల్పపీడనం ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

Updated on: Oct 21, 2025 | 8:04 PM

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు దంచికొట్టనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. 36 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మూడు రోజులపాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఏపీ, తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

రెండు తెలుగురాష్ట్రాల్లోనూ రేపటి నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రానున్న నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేసింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్నిచోట్ల తేకపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక గురు, శుక్రవారాల్లో ఖ‌మ్మం, న‌ల్లగొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడ‌క్కడ భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది. అలాగే జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, సిద్దిపేట‌, ములుగు, హ‌నుకొండ‌, వ‌రంగ‌ల్, మ‌హ‌బూబాబాద్‌, భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలిక‌పాటి నుంచి మోస్తరు వ‌ర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్‌లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. న్నై, పుదుచ్చేరి, కడలూరు, రామనాథపురం, కన్యాకుమారి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది చెన్నై ఐఎండీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అద్భుతం.. శ్రీకృష్ణుడి విగ్రహానికి చూపులేని లేగ ప్రదక్షిణలు

Dil Raju: బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్న దిల్ రాజు

Sudheer Babu: సుధీర్ బాబు కెరీర్ లో మరో డిఫరెంట్ మూవీ

ఫైనల్ రిపోర్ట్‌.. దర్శన్‌కు బిగ్ ఝలక్

Kantara Chapter 1: కాంతార దెబ్బకు.. ఛావా రికార్డ్‌ బ్లాస్ట్