Rain Alert: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. 24 గంటల్లో తీరం దాటే అవకాశం.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం పూరీ తీరానికి వాయవ్యంగా 40 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గోపాల్‌పూర్‌కు ఈశాన్యంగా 70 కి.మీ దూరంలో ఉంది. ఒడిశా నుంచి చిలక సరస్సు దగ్గరగా ఉన్న ఈ వాయుగుండం గంటకు 3 కి.మీ వేగంతో కదులుతోంది. వాయవ్యంగా కొనసాగుతూ ఒడిశా-ఛత్తీస్‌గఢ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం పూరీ తీరానికి వాయవ్యంగా 40 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గోపాల్‌పూర్‌కు ఈశాన్యంగా 70 కి.మీ దూరంలో ఉంది. ఒడిశా నుంచి చిలక సరస్సు దగ్గరగా ఉన్న ఈ వాయుగుండం గంటకు 3 కి.మీ వేగంతో కదులుతోంది. వాయవ్యంగా కొనసాగుతూ ఒడిశా-ఛత్తీస్‌గఢ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. మరో 24 గంటల్లో తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లోని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు.. కర్నూలు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సాఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. సహాయక చర్యల కోసం 3 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాట్లు చేశామని.. వరద ప్రవహిస్తున్న వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని.. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.