30 కిలోమీటర్ల వెంటాడి విద్యార్థి కాల్చివేత.. ఏం జరిగిందంటే ??
హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని భ్రమపడి 12వ తరగతి విద్యార్థిని 30 కిలోమీటర్లు వెంటాడి కాల్చి చంపారు. ఆగస్టు 23న జరిగిన ఈ ఘటనకు సంబంధించి గో సంరక్షణ గ్రూపులోని ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అనిల్ కౌశిక్, వరుణ్, కృష్ణా, ఆదేశ్, సౌరభ్‌గా గుర్తించారు. బాధితుడు ఆర్యన్ మిశ్రా, ఆయన స్నేహితులు షాంకీ, హర్షిత్‌లను నిందితులు, పశువుల స్మగ్లర్లుగా పొరబడి ఈ దారుణానికి తెగబడ్డారు.
హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని భ్రమపడి 12వ తరగతి విద్యార్థిని 30 కిలోమీటర్లు వెంటాడి కాల్చి చంపారు. ఆగస్టు 23న జరిగిన ఈ ఘటనకు సంబంధించి గో సంరక్షణ గ్రూపులోని ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అనిల్ కౌశిక్, వరుణ్, కృష్ణా, ఆదేశ్, సౌరభ్‌గా గుర్తించారు. బాధితుడు ఆర్యన్ మిశ్రా, ఆయన స్నేహితులు షాంకీ, హర్షిత్‌లను నిందితులు, పశువుల స్మగ్లర్లుగా పొరబడి ఈ దారుణానికి తెగబడ్డారు. ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై కారులో 30 కిలోమీటర్లు వారిని వెంబడించి మరీ కాల్పులు జరిపి విద్యార్థిని పొట్టనపెట్టుకున్నారు. రెనాల్డ్ డస్టర్, టొయోటా ఫార్చునర్ కార్లలో వచ్చిన స్మగ్లర్లు పశువులను ఎత్తుకుపోతున్నట్టు సమాచారం అందుకున్న గో సంరక్షకులు వారి కోసం వెతుకుతూ రోడ్డెక్కారు. పటేల్ చౌక్ వద్ద డస్టర్ కారును చూసిన నిందితులు.. కారును ఆపమని డ్రైవర్ హర్షిత్‌ను కోరారు. అయితే, తమకు కొందరితో శత్రుత్వం ఉండడంతో చంపేందుకు గూండాలను పంపి ఉంటారని భావించిన ఆర్యన్, ఆయన స్నేహితులు కారు ఆపకుండా వెళ్లారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
67 మంది ప్రాణాలు కాపాడారు.. కానీ తమ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు
Saripodhaa Sanivaaram: రూ.100 కోట్ల దిశగా ‘సరిపోదా శనివారం’
దృష్టి మరల్చి.. భలే చోరీ చేస్తారు.. ఫ్యామిలీ ఫ్యామిలీ ఇదే పని
‘రివెంజ్ సేవింగ్స్’ చేయండి.. భవిష్యత్‌లో కోటీశ్వరులు అవ్వండి
“కాందహార్ హైజాక్” వెబ్‌సీరీస్ కాంట్రవర్సీ.. నెట్‌ఫ్లిక్స్ బాస్‌కు సమన్లు